తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు యావత్ హిందువులు అందరిని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన షాక్ (Tirupati Stampede)కి గురి చేసింది. ఆ ఘటన నేపథ్యంలో ఈ రోజు అనంతపురంలో జరగాల్సిన 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. చిత్ర బృందం ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 


అర్థం చేసుకోండి..‌.
ఈ పరిస్థితుల్లో సరికాదు!
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. 


Daaku Maharaaj Pre Release Event: ''తిరుపతిలో జరిగిన ఘటన మమ్మల్ని అందరినీ తీవ్రంగా కలచి వేసింది. కోట్లాది‌ మంది భక్తుల గుండెల్లో కొలువై ఉన్న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అటువంటి ఘటన జరగడం‌ హృదయ విదారకరం. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నిర్వహించాలనుకున్న 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నాము. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కష్ట కాలంలో మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం'' అని చిత్ర బృందం పేర్కొంది.


Also Read: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?






గాడ్ ‌ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానుల కోసం అనంతపురం జిల్లాలోని ఈ రోజు (జనవరి 9న) 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తారని అనౌన్స్ చేశారు.


'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమం అమెరికాలో జరిగింది.‌ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున‌ ఎటువంటి ఈవెంట్ చేయలేదు. బాలకృష్ణ అభిమానులు అందరి‌ కోసం అనంతపురంలో ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే, తాజా తిరుపతి ఘటనతో అది కూడా క్యాన్సిల్ అయింది. ఈ నెల 12వ తేదీన సినిమా థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో వెంటనే ఈవెంట్ చేసే అవకాశం అయితే లేదు. విడుదల తర్వాత భారీ ఎత్తున సక్సెస్ మీట్ ఏదైనా చేయవచ్చేమో!? 


Also Read: నేనూ హిందువునే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి



'వాల్తేరు వీరయ్య' విజయం తర్వాత దర్శకుడు బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన సినిమా ఇది.‌ ఇందులో ప్రగ్యా జైస్వాల్,‌ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం చేశారు. ఇక చాందిని చౌదరి మరొక కీలక పాత్రలో నటించారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేసిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.