Hyderabad to Pondicherry Budget Friendly Trip : వీకెండ్ సమయంలో లేదా ఇతర లీవ్స్ తీసుకున్నప్పుడు చిన్న ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు పాండిచ్చేరి ప్లాన్ చేసుకోవచ్చు. పైగా తక్కువ బడ్జెట్‌తో మీరు ఈ ట్రిప్‌ని కంప్లీట్ చేయవచ్చు. ఆరు వేల లోపు బడ్జెట్‌తో పాండిచ్చేరి వెళ్లి.. అక్కడి అందాలను ఆస్వాదించవచ్చు. మరి ట్రిప్ డిటైల్స్ ఏంటి? టూర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? బడ్జెట్ దేనికి ఎంత అవుతుంది? నిజంగానే ఆరు వేల లోపు ట్రిప్‌ని కంప్లీట్ చేయవచ్చా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రైన్ డిటైల్స్ (ప్లాన్ ఏ)
హైదరాబాద్ నుంచి రోజూ ఓ లింక్ ట్రైన్ ఉంటుంది. అదే సికింద్రబాద్ టూ గూడూర్. నారాయాణాద్రి ఎక్స్‌ప్రెస్. ట్రైన్ నెంబర్ 12734. ఇది హైదరాబాద్ నుంచి రోజూ అందుబాటులో ఉంటుంది. ఈ జర్నీ సాయంత్రం 6.10కి మొదలై.. తెల్లవారు జామున 3.42కి ముగుస్తుంది. దీని ధర 360 రూపాయలు. గూడూరు నుంచి పాండీకి డైరక్ట్ ట్రైన్ ఉంది. ఉదయం 6.40కి ఇది స్టార్ట్ అవుతుంది. 1.30కి పాండీకి రీచ్ అవుతారు. టికెట్ ధర 255 రూపాయలు. అయితే ఇది కేవలం మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ టూ చెన్నై (ప్లాన్ బి..)
రెండు మారడం ఎందుకు? మంగళవారం ప్లానింగ్ ఎలా లీవ్స్ అడ్జెస్ట్ కావు అనుకునేవారు.. హైదరాబాద్ టూ చెన్నై ట్రైన్ జర్నీ చేయొచ్చు. చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రోజూ ఉంటుంది. ట్రైన్ నెంబర్ 12604. సికింద్రబాద్ టూ చెన్నై వెళ్లొచ్చు. ఇది సాయంత్రం 5.10 నిమిషాలకు ప్రారంభమైతే.. ఉదయాన్నే 5.40కి మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది. దీని టికెట్ ధర 420 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. చెన్నై నుంచి పాండీకి మీరు బస్‌లో వెళ్లొచ్చు. నాన్ ఏసీ అయితే 150 రూపాయలు. ఏసి అయితే 400 రూపాయలు.
స్టేయింగ్..
పాండీలో స్టేయింగ్కి మంచి ఆప్షన్స్ ఉంటాయి. కొందరు హోటల్స్ తీసుకుంటారు. మరికొందరు హాస్టల్స్ తీసుకుంటారు. మీరు హాస్టల్ తీసుకుంటే.. ధర రూ.500 నుంచి ఉంటుంది. ఇక్కడ మీరు స్కూటీని కూడా రెంట్‌కి తీసుకోవచ్చు. బైక్ రెంట్ రూ. 500. అలాగే ఫుడ్‌కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓ పర్సన్ బడ్జెట్ ఫుడ్‌కి రోజుకి రూ.500 నుంచి 800 వేసుకోవచ్చు.
Also Read : వింటర్ ట్రిప్‌కి ఇండియాలో ఇవే బెస్ట్.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ మీ సొంతం
చూడాల్సిన ప్రదేశాలు.. (Places to Visit in Pondicherry)
ఫ్రెంచ్ స్ట్రీట్ (White Town), పాండీ బీచ్, పాండిచ్చేరి మ్యూజియం, ఆరువెల్లి, మహాత్మ గాంధీ స్టాట్యూ, బొటానికల్ గార్డెన్, శ్రీ వరదరాజా పెరుమాల్ టెంపుల్, రాక్ బీచ్(Promenade Beach), ద స్కేర్డ్ హార్ట్ బాసిలికా, పారడైజ్ బీచ్, అరబిందో ఆశ్రమం, చర్చ్ (Eglise de Notre Dame des Anges) ఇలా నచ్చిన ప్లేస్‌కి వెళ్లొచ్చు. నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ వాటి ధరలు ట్రిప్ బడ్జెట్‌కి వేసుకోకూడదు. మీరు ఆడాలనుకునే, ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాటికి తగ్గట్లు ధరలు ఉంటాయి.
రిటర్న్ జర్నీ.. (Pondicherry to Hyderabad Journey)
పాండీ నుంచి హైదరాబాద్‌కి డైరక్ట్ ట్రైన్స్ లేవు. కాబట్టి మీరు పాండీ నుంచి చెన్నైకి బస్‌లో వెళ్లాలి. నాన్ ఏసీ అయితే 150 రూపాయలు. ఏసి అయితే 400 రూపాయలు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కి ట్రైన్ జర్నీ చేయాలి. సాయంత్రం 4.45కి మొదలైతే.. తర్వాతి రోజు ఉదయం 4.40కి సికింద్రాబాద్‌లో ఉంటారు. MAS HYB SF EXP (12603). ఇది డైలీ ట్రైన్. దీని ధర రూ. 415.
మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా వీలు కుదిరినప్పుడు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి ట్రిప్ వేసేయండి.
Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే