Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!

Safe Driving Tips: చలికాలంలో పొగమంచులో మీరు సురక్షితంగా ఉండాలంటే కొన్ని డ్రైవింగ్ టిప్స్‌ను కచ్చితంగా ఫాలో అవ్వాలి. లేకపోతే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

Continues below advertisement

Safe Driving Tips in Foggy Weather: పొగమంచు ఉన్నప్పుడు రోడ్లపై డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం అని చెప్పవచ్చు. అందుకే చలికాలంలో డ్రైవింగ్ చేయడం అంత తేలికైన పని కాదు. పొగమంచు కారణంగా రోడ్లపై ఏమీ త్వరగా కనిపించదు. దీని కారణంగా ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. మీరు పొగమంచులో డ్రైవ్ చేయబోతున్నట్లయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. పొగమంచులో సురక్షితంగా ఎలా డ్రైవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

నెమ్మదిగా డ్రైవ్ చేయాలి
పొగమంచులో మీ వాహనం వేగాన్ని తక్కువగా ఉంచండి. పొగమంచు కారణంగా రహదారిపై ముందు కాస్త దూరంగా వెళ్లే వాహనాలు సరిగ్గా కనిపించవు. కాబట్టి అధిక వేగంతో డ్రైవింగ్ చేయకుండా మెల్లగా వెళ్లండి. ముందు ఉండే వాహనాలకు, మీ వాహనాలకు దాదాపు 100 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.

ఓవర్‌టేకింగ్‌ చేయకండి
దట్టమైన పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓవర్‌టేక్ చేయవద్దు. పొగమంచులో దూరాన్ని నిర్ధారించడం కష్టం. కాబట్టి ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరం. ముందున్న ఇతర వాహనాల డ్రైవర్లు పరధ్యానంలో ఉంటే ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి.

ఫాగ్ లైట్లు ఉపయోగించండి
పొగమంచు సమయంలో హై బీమ్‌లను ఉపయోగించవద్దు ఎందుకంటే అవి పొగమంచులో ప్రకాశాన్ని పెంచుతాయి. దీని కారణంగా రహదారి అస్పష్టంగా కనిపిస్తుంది. లో బీమ్ ఉండే ఫాగ్ లైట్లను ఉపయోగించండి. ఎందుకంటే అవి పొగమంచులోకి చొచ్చుకుపోవడానికి, రహదారిపై ముందుకు వెళ్లడానికి సహాయపడతాయి.

Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!

అకస్మాత్తుగా బ్రేక్ వేయవద్దు
పొగమంచులో సడన్ బ్రేక్‌లు వేయడం వల్ల కారు స్కిడ్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ఇండికేటర్‌లను సరిగ్గా ఉపయోగించండి. తద్వారా మీ వెనుక వచ్చే వాహనాల డ్రైవర్లు మీరు కారు ఎటువైపు తిప్పుతారో సరిగ్గా అర్థం చేసుకోగలరు.

డీఫాగర్‌ని ఉపయోగించండి
పొగమంచు వలన మీ వాహనం విండ్‌షీల్డ్‌పై నీరు పేరుకుపోతుంది. ఇది ముందువైపు వ్యూను మరింత తగ్గిస్తుంది. కాబట్టి డీఫాగర్‌ని ఆన్ చేసి, వెంట్లను ముందు, వెనుక విండ్‌షీల్డ్ వైపుకు తిప్పండి. ఇది కాకుండా మీరు విండ్‌షీల్డ్ వైపర్‌లను కూడా ఉపయోగించవచ్చు. సురక్షితమైన డ్రైవింగ్ కోసం విండ్‌షీల్డ్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.

Also Read: సేల్స్‌లో దూసుకుపోతున్న రెనో 7 సీటర్ కారు - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!

Continues below advertisement
Sponsored Links by Taboola