Happy Mens Day 2024 Wishes in Telugu : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం వచ్చేసింది. ఈ సమయంలో మీ లైఫ్‌లో మేజర్ రోల్ చేస్తున్న మగవారికి.. మీకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపస్తున్నవారికి.. మీరు చేసే పనిలో మీకు తోడుగా, అండగా ఉంటున్నవారికి పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఇక్కడ కొన్ని విషెష్ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లలో కోట్స్ లేదా మెసేజ్ రూపంలో విష్ చెప్పేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి.
సమాజంలో, కుటుంబంలో పురుషులు చేసిన సహాయ, సహకారాలను గుర్తించి.. వారికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సొసైటీలో కొన్ని అంశాలలో మగవారికంటే.. ఆడవారికే సానుభూతి ఎక్కువగా లభిస్తుంది. కానీ వారు కూడా సానుభూతికి అర్హులే. వారిని కూడా అర్థం చేసుకుని.. మానసిక సంఘర్షణలను దూరం చేయడమే ఈ మెన్స్ డే ప్రధాన లక్ష్యం. మరి మీ జీవితంలో అత్యంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ.. మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మగవారికి ఈ స్పెషల్ డే రోజు విషెష్ చెప్పేయండిలా..
అంతర్జాతీ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు (Happy Men's Day Wishes)
- నా జీవితంలో ఉన్న గోల్డెన్ హార్ట్‌తో నన్ను అర్థం చేసుకుంటున్న మగవారి అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే. ఈ స్పెషల్ డే మీకు పూర్తి ప్రేమ, ఆనందం అందాలని కోరుకుంటున్నాను.
- స్ట్రాంగ్, సపోర్టివ్, కేరింగ్ చూపించే మగవారందరికీ హ్యాపీ మెన్స్ డే.
- మీ మంచితనంతో.. ధైర్యంతో నన్ను నమ్మి.. నా జర్నీలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క మెన్‌కి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.
- కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతూ.. మీకంటూ ఓ లైఫ్ ఉందని మరిచిపోయి.. మాకోసం ఆనందాన్ని ఇస్తున్న నాన్న.. హ్యాపి మెన్స్ డే. అంటూ మీ ఫాదర్‌కి విష్ చెప్పొచ్చు.
- నా చిన్నతనంలో తోడుగా.. కాలేజ్ వయసులో అండగా.. మొత్తం నా జీవితంలో చెరిగిపోని నేస్తంగా.. నా ధైర్యం నా బ్రదర్ అని చెప్పుకునే రేంజ్లో నువ్వు ఉన్నావ్ అన్నయ్య. నీకు ఇంటర్నేషనల్ మెన్స్ డే విషెష్ అంటూ మీ బ్రదర్‌కి విష్ చేయొచ్చు.
- మా జీవితానికి ఆదర్శంగా, రోల్ మోడల్స్‌గా నిలిచిన ప్రతి మెన్‌కి హ్యాపీ మెన్స్ డే.
- సమానత్వాన్ని ప్రోత్సాహిస్తూ.. నిరంతరం మాకు అండంగా నిలుస్తున్న పురుషులందరికీ హ్యాపి మెన్స్ డే.
- తండ్రిగా, సోదరుడిగా, కొడుకుగా, భర్తగా, ఫ్రెండ్‌గా ఉంటూ.. సక్సెస్ ఫుల్‌గా, సేఫ్‌గా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ మెన్స్ డే.
- హ్యాపి మెన్స్ డే అంటూ సింపుల్‌గా కూడా విష్ చెప్పి.. ఫోటోలు షేర్ చేయవచ్చు.
ఇలా మీ లైఫ్‌లో ఉన్న ప్రతి మగవారికి సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పవచ్చు. అంతేకాకుండా మెన్స్ డే స్పెషల్ ఫోటోలు షేర్ చేసి కూడా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పవచ్చు.
Also Read : పురుషులు దినోత్సవం ఎప్పుడు మొదలైందో తెలుసా? ప్రాముఖ్యత, చరిత్ర, థీమ్స్ ఇవే