Mahindra Thar Roxx Safety Features: మహీంద్రా థార్ రోక్స్ ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది. థార్ రోక్స్ మార్కెట్లో లాంచ్ కాకముందే ఈ ఆఫ్ రోడింగ్ కారు గురించి ప్రజలలో ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ కారు సేఫ్టీ టెస్టులో కూడా మంచి స్కోరు సాధించింది. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో థార్ రోక్స్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. క్రాష్ టెస్ట్‌లో ఈ మహీంద్రా కారు అత్యుత్తమ స్కోర్ సాధించింది. అదే సమయంలో మహీంద్రా మరో రెండు వాహనాలు భారత్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి.
మహీంద్రా థార్ రోక్స్ సేఫ్టీ స్కోర్ ఎంత?
మహీంద్రా థార్ రాక్స్ క్రాష్ టెస్ట్‌లలో భారత్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన మొదటి బాడీ ఆన్ ఫ్రేమ్ ఎస్‌యూవీగా నిలిచింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో థార్ రాక్స్ 32 పాయింట్లకు 31.09 స్కోర్ చేసింది. అదే సమయంలో ఈ కారు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49 పాయింట్లకు 45 స్కోర్ చేసింది. సాధారణ ల్యాడర్ ఫ్రేమ్‌తో ఏ ఎస్‌యూవీకి అయినా 5-స్టార్ రేటింగ్ పొందడం చాలా పెద్ద విషయం. ఐసీఈ వాహనాల్లో ఒక కారు అందుకున్న అత్యుత్తమ స్కోర్ ఇదేనని మహీంద్రా పేర్కొంది.
Also Read: రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!
థార్ రోక్స్ సెక్యూరిటీ ఫీచర్లు
మహీంద్రా థార్ రాక్స్‌లో అనేక శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లు చేర్చారు. ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. దీంతో పాటు కారులో ప్రయాణించే ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా అందించారు. ఈ మహీంద్రా కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. థార్ రాక్స్ స్టాండర్డ్ మోడల్‌తో సహా అన్ని వేరియంట్లలో ఈ సెక్యూరిటీ ఫీచర్లు చూడవచ్చు.
మహీంద్రా థార్ రాక్స్‌లో లెవెల్ 2 ఏడీఏఎస్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరాతో బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఉన్నాయి. ఈ కారులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ ఫీచర్ కూడా ఉన్నాయి.
ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ఇతర మహీంద్రా కార్లు...
మహీంద్రా తన ఇతర వాహనాలను భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ కోసం పంపింది. ఇందులో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, ఎక్స్‌యూవీ400 కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32 మార్కులకు 29.36, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 మార్కులకు 43 మార్కులు పొందింది. అయితే ఎక్స్‌యూవీ400 అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32 మార్కులకు 30.377 మార్కులు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 మార్కులకు 43 మార్కులు సాధించింది. మంచి సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చింది కాబట్టి భారతదేశంలో థార్ రోక్స్ సేల్స్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
Also Read: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!