Two Wheelers Sales Report 2024: ఈ పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో భిన్నమైన విషయాలు కనిపించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మరోసారి అద్భుతమైన సేల్స్ రికార్డులను నెలకొల్పింది. హీరో మోటోకార్ప్ 2024 అక్టోబర్‌లో 5,76,532 కొత్త ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ విక్రయాలు 37.79 శాతం పెరిగాయి. గతేడాది ఇదే నెలలో హీరో 4,18,672 యూనిట్లు విక్రయించింది.


రెండో స్థానంలో హోండా...
రెండో స్థానం గురించి చెప్పాలంటే... ఈ ప్లేస్‌ని హోండా దక్కించుకుంది. గత నెలలో కంపెనీ మొత్తం 5,54,249 యూనిట్లను విక్రయించింది. 2023 అక్టోబర్‌లో ఈ కంపెనీ విక్రయాల గురించి చెప్పాలంటే... 4,03,604 ద్విచక్ర వాహనాలను హోండా విక్రయించింది. ఇలా చూసుకుంటే హోండా అమ్మకాలు 37.32 శాతం పెరిగాయి.



Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?


మూడో స్థానంలో టీవీఎస్...
2024 అక్టోబర్‌లో అత్యధిక అమ్మకాల పరంగా టీవీఎస్ మూడో స్థానంలో ఉంది. గత నెలలో కంపెనీ మొత్తం 3,51,950 కొత్త ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో టీవీఎస్‌కు సంబంధించి 2,52,359 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. టీవీఎస్ అమ్మకాలు మొత్తంగా 17.04 శాతం పెరిగాయి.


నాలుగో స్థానంలో బజాజ్...
గత నెలలో మొత్తం 2,30,254 ద్విచక్ర వాహనాలను విక్రయించిన బజాజ్ కంపెనీ నాలుగో స్థానంలో ఉంది. 2023 అక్టోబర్‌లో విక్రయించిన 1,79,308 ద్విచక్ర వాహనాల కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఈ విధంగా చూసుకుంటే టీవీఎస్ విక్రయాలు 28.41 శాతం పెరిగాయి.


ఐదో స్థానంలో సుజుకి...
సుజుకి దేశంలోని టాప్-5 ద్విచక్ర వాహనాల జాబితాలో ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. గత నెలలో కంపెనీ 1,06,362 కొత్త ద్విచక్ర వాహనాలను విక్రయించింది. 2023 అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 80,278 వాహనాలను విక్రయించింది. కంపెనీ విక్రయాల్లో 5.15 శాతం వృద్ధి నమోదైంది.


హీరో విక్రయిస్తున్న బైక్స్‌లో స్ప్లెండర్‌నే ఎక్కువగా అమ్ముడుపోయింది. హీరో స్ప్లెండర్ విక్రయిస్తున్న చవకైన వేరియంట్ స్ప్లెండర్ ప్లస్. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ షోరూం ధర మనదేశంలో రూ. 76,356 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ లీటరు పెట్రోల్‌కు 80.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.


హీరో స్ప్లెండర్ ప్లస్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజన్‌ను కంపెనీ అందించింది. స్ప్లెండర్‌లో కంపెనీ అందించిన ఇంజన్ 8,000 ఆర్పీఎం వద్ద 5.9 కేడబ్ల్యూ పవర్‌ని, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందట. ఈ మోటార్‌సైకిల్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లుగా ఉంది. హీరో అందిస్తున్న బైక్స్ ధరలు తక్కువగా, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండటం వల్లనే దేశంలోనే నంబర్ వన్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా హీరో నిలిచింది. హీరో ప్రస్తుతం మనదేశంలో స్ప్లెండర్ ప్లస్, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హీరో ఎక్స్‌పల్స్, హీరో మావెరిక్ 440 వంటి బైక్స్ ఉన్నాయి.



Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!