Bikes Under One lakh: భారతదేశంలో మోటార్‌సైకిళ్లకు ఎన్నో సంవత్సరాలుగా క్రేజ్ ఉంది. నేటి కాలంలో బైక్‌లు ప్రజలకు నిత్యావసర వస్తువుగా మారాయి. తక్కువ ధరకు మెరుగైన మైలేజీనిచ్చే బైక్‌లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అదే సమయంలో బైక్ తయారీ కంపెనీలు కూడా సామాన్యుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, తమ అమ్మకాలను పెంచుకోవడానికి ఉత్తమమైన మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. భారతీయ మార్కెట్లో లక్ష రూపాయల బడ్జెట్‌లో ఇటువంటి బైక్‌లు చాలా ఉన్నాయి. వీటిలో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లు ఎక్కువ మైలేజీని కూడా ఇస్తాయి.
హోండా షైన్ (Honda Shine)
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో హోండా షైన్ ఒకటి. ఈ మోటార్‌సైకిల్‌లో 4 స్ట్రోక్ ఎస్ఐ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7,500 ఆర్పీఎం వద్ద 5.43 కేడబ్ల్యూ పవర్‌ని, 5,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హీరో లాంచ్ చేసిన ఈ బైక్ లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.64,900 నుండి ప్రారంభం అవుతుంది.
హీరో స్ప్లెండర్ (Hero Splendor)
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా హీరో స్ప్లెండర్ ప్లస్ నిలిచింది. నాలుగు కోట్ల మందికి పైగా హీరో స్ప్లెండర్‌ని కొనుగోలు చేశారు. ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓఎహెచ్‌సీ ఇంజన్ ఉంది. ఈ బైక్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.8 లీటర్లుగా ఉంది. ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ హీరో బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.75,441 నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
టీవీఎస్ స్పోర్ట్‌లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎయిర్ కూల్డ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజన్ 7,350 ఆర్పీఎం వద్ద 6.03 కేడబ్ల్యూ శక్తిని మరియు 4,500 ఆర్పీఎం వద్ద 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ టీవీఎస్ బైక్ లీటర్ పెట్రోలుకు 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.59,881 నుంచి ప్రారంభమవుతుంది.
బజాజ్ ప్లాటినా (Bajaj Platina)
బజాజ్ ప్లాటినాలో 115 సీసీ డీటీఎస్-ఐ ఇంజన్ ఉంది. బైక్ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లుగా ఉంది. ఈ బజాజ్ బైక్ లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.71,354 నుంచి స్టార్ట్ అవుతుంది.
ఈ బైక్‌లకు సంబంధించిన సేల్స్ మనదేశంలో ఎప్పుడూ బాగుంటాయి. వీటిలో ఇండియాలోనే హయ్యస్ట్ సెల్లింగ్ బైక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టే డబ్బులకు ఈ బైక్స్ వర్త్ అని చెప్పవచ్చు.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!