Royal Enfield Bear 650 And Classic 650 Launched: బ్రిటిష్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ ఆటో రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. బేర్ 650 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీంతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 కూడా గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ రెండు బైక్‌లతో పాటు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. బేర్ 650 భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉంది. క్లాసిక్ 650ని కూడా త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురావచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 అనేది ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా రూపొందించిన మోడల్. ఈ బైక్ రూ. 3.39 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో భారతదేశానికి వచ్చింది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో 650 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 47 బీహెచ్‌పీ పవర్, 57 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లోని ఇంజన్‌కి 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా కనెక్ట్ అయి ఉంది.
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ముందు భాగంలో 19 అంగుళాల చక్రాలు, వెనుక భాగంలో 17 అంగుళాల స్పోక్ వీల్స్ అందించారు. బేర్ 650 టీఎఫ్‌టీ సెటప్ ఉన్న సింగిల్ పాడ్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఐదు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. దీన్ని బ్రాడ్‌వాక్ వైట్, పెట్రోల్ గ్రీన్, వైట్ హనీ, గోల్డెన్ షాడో, టూ-ఫోర్ నైన్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. 650 సీసీ సెగ్మెంట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన ఆరో మోటార్ సైకిల్ ఇది. ఇంతకుముందు ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మీటోర్ 650, షాట్‌గన్ 650, లేటెస్ట్ ఎంట్రీ బేర్ 650 ఉన్నాయి. ఈ బైక్‌లో 648 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 7,250 ఆర్పీఎం వద్ద 47 హెచ్‌పీ శక్తిని, 5,650 ఆర్పీఎం వద్ద 52.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.8 లీటర్లుగా ఉంది.
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నాలుగు కలర్ ఆప్షన్లతో వస్తుంది. టీల్, వల్లమ్ రెడ్, బ్లాక్ క్రోమ్, బ్రంటింగ్‌థోర్ప్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలలో ఈ బైక్‌ను కంపెనీ విడుదల చేసింది. భారతదేశంలో క్లాసిక్ 650 కోసం బుకింగ్, టెస్ట్ రైడ్‌లు జనవరి 2025లో ప్రారంభమవుతాయి. భారతదేశంలో ఈ బైక్ ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
వీటితో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. దీన్ని బట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో దీన్ని కూడా మనదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!