Kadapa MLA Madhavi Reddy Fires On Reporter: కడప (Kadapa) డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి (MLA Madhavi Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ సమావేశానికి స్థానిక నేతలు సహా ఇతర అధికారులు హాజరయ్యారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది. అయితే, సమావేశం ముగుసిందనుకుంటున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. వాటికి సమాధానం ఇచ్చిన అనంతరం ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'డీఆర్సీ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు రాలేదు.?. ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీకి రారు. జిల్లా అభివృద్ధి సమావేశానికి రారు. ఇంకెందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది. అసలు బాధ్యత ఉందా.?. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతుంటే.. ఇవి కూడా పట్టవా.?. ఏం అనుకుంటున్నావు. దమ్ముంటే మీ నేత జగన్ సమావేశానికి రాలేదు. ఎందుకో ప్రశ్నించు. అలాగే మీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రాలేదు. అది అడుగు అంతే కానీ మీ ఇష్టం వచ్చినట్లు ప్రశ్నిస్తానంటే కుదరదు.' అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. 


వీడియో వైరల్..




దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. 'కడప డీఆర్సీ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు రాలేదు? ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీకి రాడు, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి రాడు. తల తిక్క ప్రశ్నలు అడుగుతున్న "దొంగ సాక్షి" విలేకరిని ప్రశ్నించిన కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి గారు' అంటూ ట్వీట్ చేసింది. కాగా, వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో గట్టి పోటీ ఇచ్చి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి సంచలన విజయాన్ని అందుకున్నారు. వైసీపీ నేతలపై విమర్శలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.


Also Read: Eluru Bike Recovery: స్కూటీని హత్తుకుని మహిళ కన్నీళ్లు - ఆ కష్టం వెనుక కథ ఏంటంటే?, వైరల్ వీడియో