Several people of Indian origin have been elected to US House of Representatives: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. అదే సమయంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారతమ మూలాలున్న అమెరికా పౌరులు  పలువురు విజయం సాధించారు.  అమెరికా ప్రతినిధుల సభ సెనెట్‌కు   మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు పోటీచేశారు.  వీరిలో ఆరుగురు విజయం సాధించారు. 


రాజా కృష్ణమూర్తి 


అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో విజయాన్ని అందుకున్నారు. ఇల్లినాయిస్‌ లో 8 వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్‌ పార్టీ తరుఫన పోటీ చేసి గెలిచారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్‌ రిక్‌  పై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. 2016లో తొలిసారి ఆయన అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. సెలక్ట్‌ కమిటీ ఆన్‌ చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పని చేశారు. హార్వర్డ్‌  లో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌ లో పలు పదవులు నిర్వహించారు. స్టేట్‌ ట్రెజరర్‌ గా కూడా ఆయన సేవలు అందించారు.
 
ప్రమీలా జయపాల్ 


డెమోక్రటిక్‌ నేత ప్రమీలా జయపాల్ వాషింగ్టన్  నుంచి 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేత  డాన్ అలెగ్జాండర్‌ను  ఓడించి తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పటికి పలుమార్లు సెనెట్‌కు ఎన్నికయ్యారు ప్రమీలా జయపాల్. 


రో ఖన్నా 


డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన రో ఖన్నా..2017 నుంచి కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కూడా ఇక్కడే బరిలో దిగిన ఆయన మరోసారి గెలుపు  సాధించారు. రిపబ్లికన్‌ అభ్యర్థి అనితా చెన్‌ను ఓడించి విజయం సాధించారు. గత ఏడేళ్ల నుంచి గెలుస్తూ వస్తున్నారు. 


సుహాస్‌ సుబ్రమణ్యం 


డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా వర్జీనియా  నుంచి బ  సుహాస్‌ సుబ్రమణ్యం పోటీ చేశారు.  రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మైక్‌ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా వ్యవహరిస్తున్నారు.  డెమొక్రాట్లకు కంచుకోట  రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సుబ్రమణ్యన్‌ రికార్డు సృష్టించారురు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్‌ హౌస్‌ సలహాదారుగా కూడా సుహాస్‌ పనిచేశారు.


శ్రీథానేదార్‌ 


మిచిగాన్‌   నుంచి బరిలోకి దిగిన శ్రీ థానేదార్‌  విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన ప్రత్యర్ధి రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతం ఓట్ల  తేడాతో ఓడించి, రెండవసారి గెలుపును దక్కించుకున్నారు. ఈయన 2023 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


డాక్టర్‌ అమిబెరా  


వృత్తి పరంగా వైద్యుడు అయిన అమిబెరా.. సీనియర్‌ మోస్ట్‌ ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యుడు.2013 నుంచి కాలిఫోర్నియా  నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి బరిలోకి దిగిన అమిబెరా.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు.


అమిష్‌ షా 


అమిష్ షా అరిజోనా నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అతను రిపబ్లికన్‌కు చెందిన  డేవిడ్ ష్వీకర్ట్‌ కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు విజయం దక్కించుకున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డేవిడ్‌ స్క్యూకెర్ట్‌తో అమిష్‌పై ఆధిక్యంలోున్నారు.  అరిజోనా స్టేట్‌ అసెంబ్లీలో వరుసగా 2018, 20, 22ల్లో విజయం సాధించిన డాక్టర్‌ అమిష్‌ షా మరోసారి ఫామ్ చూపించారు.