September WhatsApp Accounts Banned: సెప్టెంబర్‌లో పాలసీని ఉల్లంఘించిన 85 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ ఖాతాలను మెటా బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. వినియోగదారుల భద్రతను పెంచడానికి, ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆగస్టులో భారతదేశంలో 84 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది.
వాట్సాప్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య 85,84,000 ఖాతాలను నిషేధించింది. వాటిలో 16,58,000 ఖాతాలను వినియోగదారుల నుంచి ఎటువంటి నివేదికను అందుకోకముందే బ్లాక్ చేశారు. 60 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్‌కు సెప్టెంబర్ నెలలో 8,161 ఫిర్యాదులు అందాయి. వాటిలో 97 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
అకౌంట్లు బ్యాన్ చేయడంపై కంపెనీ ఏం అంటోంది?
వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసే విషయంలో కంపెనీ ఇలా చెప్పింది. "మా పనిలో పారదర్శకత ఉండేలా చూసుకుంటాం. భవిష్యత్ నివేదికలలో మా ప్రయత్నాల గురించి సమాచారాన్ని చేర్చుతాం." అని చెప్పింది. "యాప్‌లోనే ఏదైనా కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాం. అలాగే యూజర్ ఫీడ్‌బ్యాక్‌పై చాలా శ్రద్ధ వహిస్తాం. తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి, సైబర్ సెక్యూరిటీని ప్రోత్సహించడానికి నిపుణులతో పని చేస్తూనే ఉంటాం." అని కూడా తెలిపింది
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021లో ఐటీ నిబంధనలను అమలు చేసింది. దీని ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నెలవారీ నివేదికలను జారీ చేయడం తప్పనిసరి. ఈ నివేదిక వినియోగదారుల ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D), రూల్ 3A(7) ప్రకారం ఈ చర్య తీసుకున్నారు. వినియోగదారుల సెక్యూరిటీని నిర్ధారించడానికి దీన్ని అమలు చేశారు.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?