Used Car Buying Tips: తమ కుటుంబానికి మంచి కారు కొనాలనేది చాలా మంది కల. కానీ అధిక ధర లేదా మరేదైనా కారణాల వల్ల ఈ కల కొన్నిసార్లు నెరవేరదు. కొంతమంది కొత్త కారు కొనడానికి బదులు సెకండ్ హ్యాండ్ కారు కొనేవారు ఉన్నారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకుంటున్నట్లయితే తప్పకుండా పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.


సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. జాగ్రత్తగా లేకుంటే డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే, దానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా మీరు మంచి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయవచ్చు.


మీ బడ్జెట్‌ను ముందుగానే నిర్ణయించుకోండి
సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం మీకు అత్యంత ముఖ్యమైన విషయం. మీకు నచ్చిన కారు మార్కెట్ విలువ, రీసేల్ వాల్యూ, డిమాండ్ గురించి మీరు తప్పనిసరిగా సమాచారాన్ని సేకరించాలి. దీంతో పాటు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కారు ధరను కూడా తనిఖీ చేయండి.


టెస్ట్ డ్రైవ్ ముఖ్యం
మీరు పాత కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే దానికి ముందు ఆ కారును సుదీర్ఘంగా టెస్ట్ డ్రైవ్ చేయండి. దీని వల్ల కారు బాగా నడుస్తుందో లేదో తెలుసుకుని ఏదైనా సమస్య ఉంటే ముందే అర్థం చేసుకోవచ్చు. వీలైతే అనుభవజ్ఞుడైన వ్యక్తి ద్వారా కూడా కారును నడపండి.



Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!


అసెస్‌మెంట్ కూడా ముఖ్యం
మూడో, అతి ముఖ్యమైన విషయం అసెస్‌మెంట్. టెస్ట్ డ్రైవ్ సమయంలో కారు లోపాలను, దాని మార్కెట్ ధర, అడిగే ధర అన్నింటినీ అంచనా వేయండి. కారులో చిన్న లోపాలు ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చును ఖచ్చితంగా అంచనా వేయండి. కారు కోసం సరైన ధరను ఎంచుకోండి.


మెకానిక్‌తో చెక్ చేయించండి
పాత కారును కొనుగోలు చేసే ముందు మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దానిని మంచి మెకానిక్ ద్వారా లేదా కంపెనీ సర్వీస్ సెంటర్‌కి వెళ్లడం ద్వారా చెక్ చేయించాలి. దీని వల్ల కారులో ఏదైనా సమస్య ఉంటే మీకు తెలుస్తుంది.


సర్వీస్ రికార్డును కూడా చూసుకోవాలి
మీరు తెలుసుకోవలసిన చివరి విషయం ఏమిటంటే కారు ఫైనల్ చేయడానికి ముందు దాని సర్వీస్ రికార్డ్‌ను కూడా చెక్ చేయాలి. ఇది కారుకు ఎన్ని సర్వీసులు అయ్యాయి. ఏ భాగాలు మార్చారు అని మీకు తెలియజేస్తుంది.


ప్రస్తుతం మనదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ బాగా పెరిగాయి. అమ్మే వారు, కొనే వారు ఇద్దరూ ఎక్కువ అయ్యారు. కాబట్టి ఇలాంటి కార్లు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.



Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!