Horoscope Today November 19, 2024
మేష రాశి
ఈ రోజు గొప్ప రోజు. కార్యాలయంలో మీ సహకారంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఓ శుభవార్త వింటారు. వైవాహిక బంధంలో అహంకారాన్ని దరిచేరనీయవద్దు. మీ ప్రవర్తనను వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతుంది.
వృషభ రాశి
రోజంతా బిజీగా ఉంటారు. కుటుంబంలో వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్చ జరుగుతుంది...మీకు సరైన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆగ్రహం పెరుగుతుంంది. మీ లక్ష్యాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథున రాశి
ఈ రోజ మీరు ఆర్థికపరంగా అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మీ పనికి తగిన ప్రశంసలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. చిన్న పిల్లల భద్రత విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. నూతన ఉద్యోగ ప్రయత్నంలో ఉండేవారి ఎదురుచూపులు ఫలిస్తాయి.
Also Read: ఈ రాశులవారు ఈ వారం కలల ప్రపంచం నుంచి బయటపడితే అన్నీ శుభఫలితాలే!
కర్కాటక రాశి
ఈ రోజు ఆర్థికపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనికిరాని పనిలో మీ సమయాన్ని వృథా చేయకండి. సంభాషణ ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆత్మపరిశీలన , విశ్లేషణ అవసరం. మీ శ్రేయోభిలాషులపట్ల చక్కని ప్రవర్తనతో ఉండండి.
సింహ రాశి
ఈ రోజు రాజకీయాల్లో ఉండే సింహరాశివారికి అదృష్టం కలిసొస్తుంది. మా మాటకు పవర్ పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు అందుకుంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
కన్యా రాశి
ప్రజల్లో స్ఫూర్తిదాయకంగా ఎదుగుతారు. ఉద్యోగంలో మార్పు గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పాత విషయాలను వదిలేసి కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నించండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి..ఈ సమయంలో పెట్టే నూతన పెట్టుబడులు కలిసొస్తాయి.
తులా రాశి
ఈ రాశివారు రోజంతా బిజీగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పిల్లలకు మంచి విషయాలు బోధించండి. భగవంతుడిపై అంత శ్రద్ధ చూపించరు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొస్తాయి , శత్రువులు కూడా మిత్రులవుతారు!
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు గందరగోళ పరిస్థితిలో కూరుకుపోవచ్చు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు ప్రయత్నించండి. కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల అభిప్రాయం తీసుకోవద్దు. ఓపిక చాలా అవసరం. విద్యార్థులు చదువుపై సంపూర్ణంగా దృష్టి సారించాలి.
ధనస్సు రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. వ్యాపారం , వృత్తికి సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోవచ్చు. మీరు ఈ రోజు పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్లిష్ట పరిస్థితులను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది
మకర రాశి
ఈ రోజు వ్యాపారంలో కొత్త డీల్ ఉండవచ్చు. సహోద్యోగి చేసిన తప్పును విస్మరించి..వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించండి. కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టేయవద్దు. ఏకాగ్రతతో కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.
Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!
కుంభ రాశి
ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ఇంటర్వ్యూకి కాల్ రావచ్చు. ఉద్యోగంలో మంచి ప్రతిభ కనబరుస్తారు. వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
మీన రాశి
పిల్లలకు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. ఉద్యోగులపై ఒత్తిడి ఉండవచ్చు. చదవడంపై ఆసక్తి పెరుగుతుంది. ఆడంబరాలకు మరియు గుడ్డి విశ్వాసానికి దూరంగా ఉండండి. పాత మిత్రులను కలుస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.