18 November to 24 November 2024 Horoscope: ఈ వారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొస్తాయి , శత్రువులు కూడా మిత్రులవుతారు!

18 November to 24 November 2024 Horoscope In Telugu: నవంబరు 18 నుంచి నవంబరు 24 వరకూ మీ రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి...

Continues below advertisement

 18 November to 24 November 2024 Horoscope In Telugu

Continues below advertisement

మేష రాశి వారఫలాలు

ఈ వారం ఆస్తికి సంబంధించిన విషయాలు కలిసొస్తాయి. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. న్యాయవాదుల రంగానికి సంబంధించిన వ్యక్తులు పెద్ద కేసులలో భాగం అవుతారు. మీ ప్రత్యర్థులు మీ ముందు బలహీనులవుతారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఫైనాన్స్ , బ్యాంకింగ్‌కు సంబంధించిన నిపుణులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. ఇంట్లో, కార్యాలయంలో సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తేలికగా తీసుకోకండి. అపరిచితులతో స్నేహం చేసేముందు ఆలోచించండి. వైవాహిక జీవితంలో కొంత గందరగోళంగా అనిపించవచ్చు. 

వృషభ రాశి వారఫలాలు

ఈ వారం మీకు అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. మీ మనస్సులో చాలా ప్రణాళికలు ఉంటాయి. వ్యాపారంలో చాలా బాగా రాణిస్తారు. కుటుంబ ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వండి. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. వివాహ సంబంధాలలో ప్రేమ భావాలు పెరుగుతాయి. మీ ధనం ధార్మిక పనులకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు సమాజంలో  గౌరవం లభిస్తుంది.  వ్యవసాయ సంబంధిత పనుల్లో ఉండేవారు ఆర్థికంగా లాభపడతారు. మీ పని శైలిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. అధిక రక్తపోటు ఉన్నవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాలు పెద్దగా కలసిరావు.

Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

కన్యా రాశి వారఫలాలు

ఈ వారం మొత్తం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.  కార్యాలయంలో మీ లక్ష్యాలను సమయానికి ముందే పూర్తి చేస్తారు. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు..తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది.  పొదుపు చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది, నచ్చని వ్యక్తులను కలుస్తారు. కమీషన్ సంబంధిత పనుల నుంచి మీరు ఆశించిన లాభాలను పొందలేరు. మీ మనస్సులో కొన్ని అసూయ ఆలోచనలు తలెత్తవచ్చు. మీరు భాగస్వామ్యం చేయాలనుకుంటే పత్రాలు, సంతకాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

తుల రాశి వారఫలాలు

ఈ వారం మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులుంటాయి. వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది.  మీ ఆశయాలు నెరవేరుతాయి.  కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలుకు ఈ వారం చాలా అనుకూలమైనది. సమాజంలోని ఉన్నత వర్గాల్లో మీ ప్రభావం పెరుగుతుంది.  మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయండి. మీ ప్రత్యర్థులు కూడా మీ పట్ల స్నేహపూర్వకంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఆర్థిక పరంగా  ఈ వారం ద్వితీయార్ధం మీకు చాలా మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. కమ్యూనికేషన్ మీడియాను దుర్వినియోగం చేయవద్దు. అప్పులు తీసుకోవద్దు. ముఖ్యమైన పని చేసే ముందు మీ ప్రణాళికల గురించి ఆలోచించండి.

Also Read: శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!

వృశ్చిక రాశి వారఫలాలు

ఈ వారం చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కొత్త విజయాలు సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది.  కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ కళలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. మీ తప్పులను కప్పిపుచ్చుకునే బదులు  మీరు వాటి నుంచి పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.  ఇనుము వ్యాపారులకు లాభాలు తక్కువగా ఉంటాయి. కంటికి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది

కుంభ రాశి వారఫలాలు

ఈ వారం ఈ రాశివారికి చాలా బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది. ఇంటికి దగ్గరి బంధువులు రావచ్చు. మీరు ఆర్థిక ప్రయోజనాల కోసం చాలా మంచి అవకాశాలను పొందుతారు. దిగుమతి-ఎగుమతి మరియు మార్కెటింగ్ నుంచి అధిక ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అవివాహితుల వివాహాలు ఖరారయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. వైవాహిక బంధంలో అపనమ్మకం ఏర్పడవచ్చు. తోబుట్టువుల గురించి ఆందోళన చెందుతారు.  వ్యాపారంలో పారదర్శకత పాటించాలి. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Continues below advertisement