Cosmetic Treatment for Lips : తెరపైకి వచ్చే బ్యూటీ ట్రెండ్స్‌లో లిప్ ఫిల్లర్స్ టాప్ ప్రయారిటీగా మారిపోయింది. హీరోయిన్లు సైతం ఈ కాస్మోటిక్ ట్రీట్మెంట్ బాట పట్టారు. తమ లుక్ అందంగా కనిపించాలని చాలామంది ఇన్ఫ్లూయెన్స్ర్స్ కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అసలు లిప్ ఫిల్లర్స్ ట్రీట్మెంట్ని ఎలా చేస్తారా? దీనివల్ల కలిగే మార్పులు ఏంటి? ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుందా? లేదంటే ఎక్స్‌పైయిరీ డేట్ ఉంటుందా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
లిప్ ఫిల్లర్స్ ప్రాసెస్..
లిప్ ఫిల్లర్స్ అనేది కాస్మోటిక్ ట్రీట్మెంట్. ఇది బాగా పాపులర్ కూడా. ఇది పెదాల సైజ్, షేప్, లుక్‌ని మార్చే ఓ కాస్మోటిక్ ప్రక్రియ. లిప్ ఫిల్లర్స్ అంటే.. లిప్ ఇంజెక్షన్లు, లిప్ ఆగ్యూమెంటేషన్, సర్జికల్ ప్రక్రియ లేకుండా.. పెదాల్లోకి ఫిల్లర్స్ని ఇంజెక్ట్ చేస్తారు. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ని పెదాల షేప్ మార్పుకోవడానికి, ముఖ్యంగా పెదాల సైజ్, వాల్యూమ్ పెంచుకోవడానికి చేయించుకుంటారు. ముడతలు, ఫైన్ లైన్స్‌ని దూరం చేసుకుని.. పెదాలు జ్యూసీగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.
లిప్ ఫిల్లర్స్లో రకాలు..
లిప్ ఫిల్లర్స్లో కూడా పలు రకాలు ఉంటాయి. హైల్యూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ (Hyaluronic acid fillers) ఒక రకం. ఇది తాత్కాలిక ఫలితాలు ఇస్తుంది. బయోడిగ్రేడబుల్, రివర్స్‌బుల్ ఫిల్లర్స్ ఇవి. కొల్లాజెన్ ఫిల్లర్స్ (Collagen fillers) మరో రకం. వీటిని యానిమల్ ప్రొడెక్ట్స్ నుంచి తయారు చేస్తారు. కాకుంటే వీటిని తక్కువగా ఉపయోగిస్తారు. అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. సింథటిక్ లిప్ ఫిల్లర్స్(Synthetic fillers). వీటిలో సిలికోన్, PMMA వంటివి ఉంటాయి. అయితే ఇవి శాశ్వత ఫలితాలు ఇస్తాయి. కాకపోతే.. రిస్క్ ఎక్కువ. కాంప్లికేషన్స్ ఉంటాయి. అటోలోగస్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ (Autologous fat transfer). ఈ ట్రీట్మెంట్కోసం శరీరంలోని కొవ్వును తీసి.. లిప్ని ఫిల్ చేస్తారు.
ఉపయోగాలు ఏంటి?
ఈ లిప్ ఫిల్లర్స్ ప్రొసెస్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం 15 నిమిషాల నుంచి అరగంట సమయం సరిపోతుంది. డౌన్ టైమ్ కూడా చాలా తక్కువ. మీరు ఎలా కావాలనుకుంటే అలాంటి ఫలితాలు మీ లిప్స్ విషయంలో పొందవచ్చు. తాత్కాలిక అడ్జెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. వయసు ప్రభావం వల్ల పెదాలు మారడం, జెనిటిక్స్ వల్ల లిప్స్ సరిగ్గా లేకపోవండ లేదా పెదాలు బాలేవనే మీ ట్రోమాను దూరం చేసుకోవచ్చు.
రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే..
కొందరిలో లిప్ ఫిల్లర్స్ అలెర్జిక్ రియాక్షన్లు ఇస్తాయి. పెదాల్లో వాపు రావడం, అనుకున్నదానికంటే ఎక్కువగా మారడం, ఎరుపుదనం పెరిగి.. ఇన్ఫెక్షన్లు రావడం, పెదాల షేప్ మారిపోవడం, చూసేందుకు ఇబ్బందిగా కనిపిచడం వంటివి జరుగుతాయి. మంటతో కూడిన ఇన్ఫెక్షన్లు రేర్‌గా వస్తాయి.
ఎంతకాలముంటాయంటే..
లిప్ ఫిల్లర్స్ని తాత్కాలికంగా చేయించుకోవచ్చు. 6 నుంచి 12 నెలలు ఉండొచ్చు. మరికొన్ని శాశ్వతమైన లిప్ ఫిల్లర్స్ ఉంటాయి. అయితే వీటికి కొన్ని టచ్ అప్స్ అవసరమవుతూ ఉంటాయి.
చికిత్స ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు ఈ బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు.. క్వాలిఫై అయిన డాక్టర్ని సంప్రదించాలి. మీ మెడికల్ హిస్టరీ, అలెర్జీలు, మెడికేషన్స్ గురించి చెప్పాలి. లిప్ ఫిల్లర్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, పర్యవసనాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీ పెదాలకు, ముఖానికి తగిన లిప్ ఫిల్లర్ ఎంపిక చేసుకోవాలి.
ఫాలో అవ్వాల్సిన టిప్స్
లిప్ ఫిల్లర్స్ చేయించుకున్న తర్వాత కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వాపును తగ్గించుకునేందుకు ఐస్ క్యూబ్స్‌ని అప్లై చేయాలి. సున్నితమైన లిప్ కేర్ ప్రొడెక్ట్స్ ఉపయోగించాలి. వైద్యుల సూచనలు తప్పకుండా ఫాలో అవ్వాలి. ట్రీట్మెంట్ ఫాలో అప్స్ రెగ్యూలర్‌గా అటెండ్ అవ్వాలి.
Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే