Baby Travel Tips and Tricks : పిల్లలతో ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన విషయం. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 ఇయర్స్లోపు పిల్లలతో ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు కిడ్స్‌తో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మీ జర్నీ స్మూత్‌గా అయ్యేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రావెల్‌కి ముందు..
పిల్లలతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నప్పుడు కచ్చితంగా పిడియాట్రిషియన్ని మీట్ అవ్వాలి. వారి నుంచి ట్రావెల్ సలహాలు తీసుకోవాలి. అలాగే కచ్చితంగా ప్యాక్ చేసుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. డైపర్స్, మిల్క్ ఫార్మూలా, బేబి ఫుడ్ ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి. మీరు వెళ్లకముందే స్టే చేయాల్సిన హోటల్స్, లేదా రూమ్స్‌పై కచ్చితంగా అవగాహన ఉండాలి. విమానంలో ప్రయాణించాలనుకుంటే ఎయిర్ లైన్ బేబి పాలసీలు, జెట్ లాగ్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.
కచ్చితంగా ప్యాక్ చేసుకోవాల్సినవి..
డైపర్స్, వైప్స్ ప్యాక్ చేసుకోవడమే కాకుండా.. అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మిల్క్ ఫార్మూలా లేదా బ్రెస్ట్‌మిల్క్ స్టోరేజ్ సిద్ధం చేసుకోవాలి. పిల్లలు తినే ఫుడ్స్, స్నాక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. బాటిల్స్, సిప్పర్స్ ఉండాలి. ఎక్స్ట్రా డ్రెస్‌లు ఉండాలి. పిల్లల్నీ క్యారీ చేసేందుకు స్టోలర్స్ లేదా బేబి క్యారియర్స్ వాడాలి. మెడిసన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. బొమ్మలు, పుస్తకాలు, మ్యూజిక్ కూడా ఉండేలా చూసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోడ్ ట్రిప్స్ అయితే రెగ్యూలర్ బ్రేక్ ఉండేలా చూసుకోవాలి. విమానంలో అయితే ఏ టైమ్‌కి వెళ్లుతున్నారనే అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. బేబి ఎమర్జెన్సీ కిట్ తీసుకువెళ్లాలి. కార్లో బేబి కార్ సీట్ ఉండేలా చూసుకోవాలి. బేబి ఫ్రెండ్లీ హోటల్స్ తీసుకోవాలి. మీరు వెళ్లిన తర్వాత ఉయ్యాల లేదా క్రిబ్ ఉండేలా సెట్ చేసుకుంటే మంచిది. 6 నెలల్లోపు పిల్లలు అయితే కంఫర్ట్, రోటీన్ ఉండేవిధంగా చూసుకోవాలి. 6 నుంచి 12 నెలల లోపు పిల్లలతో ట్రావెల్ చేస్తుంటే బొమ్మలు, స్నాక్స్ ఉండేలా పిప్రేర్ అవ్వాలి. 1 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు బ్రేక్స్ ఇవ్వడంపై ఫోకస్ చేయాలి.
ఆరోగ్యం విషయంలో..
పిల్లల విషయానికొస్తే ముందుగా ఆరోగ్యానికే ప్రధాన్యతనివ్వాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇతర ప్రదేశాల్లో వివిధ రకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్లే ప్రాంతం, ట్రావెల్‌ని బట్టి నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇన్సెక్ట్ రిప్లెంట్స్ ఉండేలా చూసుకోవాలి. పిల్లల బాడీ టెంపరేచర్ని మానిటర్ చేస్తూ ఉండాలి. వెళ్లే ప్రాంతంలో ఆస్పత్రులు, వైద్య సేవలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలి.
ఇబ్బంది లేకుండా..
పిల్లల విషయంలో ఏది ఎప్పుడు అవసరం అవుతుందో తెలీదు కాబట్టి.. ప్రతి వాటిని ఎక్స్ట్రాగా ప్లాన్ చేసుకోవడమే మంచిది. మీరు వెళ్లే ప్రాంతంలో కూడా అవి అందుబాటులో లేకుంటే ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. మీకు తోడుగా ఓ పర్సన్ కూడా ఉంటే మరీ మంచిది. అయితే ఇక్కడో విషయం గుర్తించుకోవాలి. ప్రతి పిల్లలు డిఫరెంట్‌గా ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి.. వాటికి తగ్గట్లు తల్లిదండ్రులు ప్రిపేర్ అవ్వాలి.
Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే