Sairam Shankar: విలన్ ఎవరో పట్టుకుంటే పది వేలు... ‘ఒక పథకం ప్రకారం’ ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో సాయిరామ్ శంకర్

Oka Pathakam Prakaram Contest: చాలా గ్యాప్ తర్వాత హీరో సాయిరాం శంకర్ నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని చిత్ర మేకర్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు..

Continues below advertisement

Oka Pathakam Prakaram Movie: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు.. ‘143’, ‘బంపర్ ఆఫర్’ చిత్రాల హీరో సాయిరాం శంకర్ చాలా గ్యాప్ తర్వాత వస్తూ.. ప్రేక్షకులకు ఓ ‘బంపర్ ఆఫర్’ ప్రకటించారు. ‘143, బంపర్ ఆఫర్’ వంటి హిట్స్ తర్వాత సాయిరాం శంకర్ కొన్ని సినిమాలు చేసినా.. ఏదీ కూడా ఆయనని నిలబెట్టలేకపోయాయి. దీంతో ఆయన మంచి కథ కోసం చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడా గ్యాప్‌ని ఫిల్ చేసే సినిమాతో వస్తున్నానని అంటున్నాడీ ప్రామిసింగ్ హీరో. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆయన ఇస్తున్న ‘ఆఫర్’ ఏంటి అనే విషయానికి వస్తే..

Continues below advertisement

సాయిరాం శంకర్, శ్రుతి సోధి, ఆశిమా నర్వాల్ హీరోహీరోయిన్లుగా వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర విశేషాలను తెలిసేందుకు తాజాగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ప్రేక్షకులకు బంపర్ బొనాంజాను ప్రకటించారు. ఇదే ఈ చిత్ర పబ్లిసిటీకి ఆయుధంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సాయిరాం శంకర్ ఈ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..

Read Also: Bollywood Movies: ప్రభాస్ - ఇమాన్వీ to విక్కీ - రష్మిక వరకు... 2025లో సిల్వర్ స్క్రీన్ మీద రొమాన్స్ చేసే ఫ్రెష్ జోడీలు

ఈ మీడియా సమావేశంలో హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా పేరు ‘ఒక పథకం ప్రకారం’. ఈ సినిమాలో నాది లాయర్ పాత్ర. నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్‌ని. క్రిమినల్ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా? ఇలా ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్‌తో ఇంటెన్సిటీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు వినోద్ విజయన్ ప్రొడ్యూస్ చేసిన ‘ఒట్టాల్’ అనే సినిమా బెర్లిన్ అవార్డ్‌‌తో పాటు నేషనల్ అవార్డ్‌ను గెలుచుకుంది. ఇంకా ఈ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, మేకప్ మ్యాన్ ఇలా అందరూ నేషనల్ అవార్డ్స్‌ని గెలుచుకున్నవారే. చాలా గొప్ప టీమ్ కుదిరింది. మళ్లీ ఇలాంటి టీమ్‌తో నేను వర్క్ చేస్తానో లేదో కూడా తెలియదు. అంత గొప్ప టీమ్‌తో నేను పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు వచ్చిన గ్యాప్‌ని ఈ సినిమా ఫిల్ చేస్తుంది. స్క్రీన్‌ప్లే, కథ, నన్ను ప్రొజక్ట్ చేసిన విధానం అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. 100 శాతం నా కెరీర్‌కి ఉపయోగపడే సినిమా ఇది. సినిమా మొదలైనప్పటి నుండి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫీల్ ఇస్తూ.. ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు అనుకోకపోతే.. నన్ను అందరూ తిట్టుకోవచ్చు.. వీడు ఇంతేరా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఛాన్స్ ఈ సినిమా ఇవ్వదని నేను నమ్మకంగా చెప్పగలను. ప్రతి షాట్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్‌ ఎంతో శ్రద్ధతో ఈ సినిమాను తీస్తే.. మేము కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని అందరం పని చేశాం. ఈ సినిమా నాకు ఊపిరినిస్తుంది. చాలా మంచి సినిమా చేశాం.. మీరంతా ఆదరిస్తే మేము నిలబడతాం. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మా టీమ్‌ని అభినందిస్తారు. అందులో నో డౌట్. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో అయితే చూసుండరు. మంచి క్వాలిటీ, మేకింగ్ సినిమాను మరోసారి చూడబోతున్నాం. 

ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో చిన్న కాంటెస్ట్ అనుకుంటారో, ఛాలెంజ్ అనుకుంటారో తెలియదు కానీ.. ఇదే మా సినిమా ప్రమోషన్‌గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ‘పట్టుకుంటే పదివేలు.. ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే మీరే హీరో’ ఇదే కాంటెస్ట్. ఈ కాంటెస్ట్‌లో పాల్గొని, రూ. 10 వేలు గెలుపొందాలంటే మీరు చేయాల్సిందే ఏంటంటే.. సినిమా చూస్తూ.. ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే మీకు స్పాట్‌లో పదివేలు ఇస్తారు. సినిమా విడుదలైన రోజు మొదటి ఆటకు.. మీరు థియేటర్‌లోకి వెళ్లేప్పుడు ఒక కూపన్ ఇస్తారు. ఇంటర్వెల్ లోపు ఆ కూపన్‌లో విలన్ ఎవరో మీరు రాసివ్వాలి. సెకండాఫ్ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్ అయితే.. స్పాట్‌లో మీకు పదివేలు ఇస్తారు. ఇలా మొత్తం ఒక 50 సెంటర్స్‌లో మేము ఈ కాంటెస్ట్ పెట్టబోతున్నాం. ఈ సినిమాపై ఇంత నమ్మకం ఎందుకంటే.. స్క్రీన్‌ప్లే అలా ఉంటుంది. క్లైమాక్స్ వరకు విలన్ ఎవరో కనిపెట్టలేరు. అంత గొప్పగా కథ, స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ సినిమాను రెడీ చేశారు. ఇదే మా సినిమాకు పబ్లిసిటి. ఫిబ్రవరి 7న థియేటర్లలో కలుసుకుందాం. 10 వేలు గెలుచుకునేదెవరో చూద్దాం’’ అని చెప్పుకొచ్చారు. గార్లపాటి రమేష్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌‌తో కలిసి.. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిల్మ్స్ బ్యానర్‌‌పై నిర్మిస్తున్నారు.

Also Readచిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రియాంక చోప్రా - రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు ఎందుకు థాంక్స్ చెప్పిందంటే?

Continues below advertisement