Bollywood Movies: ప్రభాస్ - ఇమాన్వీ to విక్కీ - రష్మిక వరకు... 2025లో సిల్వర్ స్క్రీన్ మీద రొమాన్స్ చేసే ఫ్రెష్ జోడీలు
9 New Onscreen Pairs in 2025 : ప్రభాస్ నుంచి రష్మిక మందన్న వరకు పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది కొత్త స్టార్స్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారు.

పీరియాడిక్ డ్రామాల నుంచి రొమాంటిక్ కథల వరకు ఈ ఏడాది పలు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఆన్ స్క్రీన్ పై ఫ్రెష్ జోడీలు సందడి చేయబోతున్నాయి. తమ సినిమా కెరీర్ లోనే ఫస్ట్ టైం 10 జంటలు స్క్రీన్ పై మ్యాజిక్ ను ఫ్రెష్ మ్యాజిక్ ను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
షాహిద్ కపూర్ - పూజా హెగ్డే
ఇక ఈ ఏడాది కొత్తగా తెరపై కనిపించబోతున్న జంటల్లో షాహిద్ కపూర్ - పూజా హెగ్డే జంట కూడా ఒకరు. వీరిద్దరూ కలిసి 'దేవా' అనే సినిమాతో జనవరి 31న ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
రష్మిక మందన్న - విక్కీ కౌశల్
విక్కీ కౌశల్ - రష్మిక మందన్న జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో 'చావా' అనే హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరాఠా రాజు శంబాజీ స్టోరీతో రూపొందుతోంది. ఇందులో విక్కీ శంబాజీ పాత్రను పోషిస్తుండగా, రష్మిక యేసుభాయి భోన్సాలే గా కనిపించబోతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావలసి ఉండగా, 'పుష్ప 2' రిలీజ్ కారణంగా వాయిదా పడింది.
ప్రభాస్ - మాళవిక మోహనన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాళవిక మోహన్ మొట్టమొదటిసారి రొమాంటిక్ కపుల్ గా 'ది రాజా సాబ్' మూవీలో నటించబోతున్నారు. అందులోని నిధీ అగర్వాల్, రిద్ధీతోనూ ఆయనకు ఇదే మొదటి సినిమా. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హర్రర్ కామెడీ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న 'ఫౌజీ'లో హీరోయిన్ ఇమాన్వీతో ఆయనకూ ఇదే తొలి సినిమా.
సిద్ధార్థ్ మల్హోత్రా - జాన్వి కపూర్
తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్న 'పరమ్ సుందరి' చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా - జాన్వి కపూర్ కలిసి ఫస్ట్ టైం తెరపై కనిపించబోతున్నారు. ఈ ఏడాది జూలైలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
హృతిక్ రోషన్ - కియారా అద్వానీ
మోస్ట్ అవైటింగ్ స్పై థ్రిల్లర్ 'వార్ 2' సినిమాలో ఈ జంట మొట్టమొదటిసారి కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ధనుష్ - కృతి సనన్
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తేరే ఇష్క్ మే' అనే సినిమాలో ధనుష్ - కృతి సనన్ ఫస్ట్ టైం రొమాన్స్ చేయబోతున్నారు. 2025లోనే ఈ లవ్ స్టోరీ తెరపైకి రాబోతోంది.
Also Read: చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రియాంక చోప్రా - రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు ఎందుకు థాంక్స్ చెప్పిందంటే?
జునైద్ ఖాన్ - ఖుషి కపూర్
అద్వైత్ చందన దర్శకత్వంలో రాబోతున్న రొమాంటిక్ డ్రామాలో జునైద్ ఖాన్ - ఖుషి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
విక్రాంత్ మాస్సే - షనాయా కపూర్
'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' డైరెక్టర్ సంతోష్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో విక్రాంత్ - షానాయ కపూర్ కలిసి కనిపించబోతున్నారు.
ఆదిత్య కపూర్ - సారా అలీ ఖాన్
అనురాగ్ బసు దర్శకత్వంలో 'మెట్రో ఇన్ డినో' అనే సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్ - సారా అలీ ఖాన్ ఫస్ట్ టైం స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నారు. ఈ సినిమా 2025 లోనే రిలీజ్ కానుంది.