నయనతార లైఫ్ పై వచ్చిన డాక్యుమెంటరీ గత కొన్ని రోజుల నుంచి వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ వల్ల కోలీవుడ్ టాప్ యాక్టర్స్ అయిన నయన్, ధనుష్ మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుతం వీరిద్దరి వివాదం కోర్టులో నడుస్తుండగానే, మరోవైపు నయనతార హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ మూవీ 'చంద్రముఖి' మూవీ టీం తమ అనుమతి లేకుండా ఆ సినిమాలోని క్లిప్స్ ని ఈ డాక్యుమెంటరీ లో వాడుకున్నందుకు నయన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ కి కూడా నోటీసులు పంపింది అనే వార్తలు వినిపించాయి నేషనల్ మీడియాలో. తాజాగా ఈ విషయంపై చంద్రముఖి నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
అసలు ఏం జరిగింది అంటే?
'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. గత ఏడాది ఎండింగ్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ మొదలైంది. అలా స్ట్రిమింగ్ మొదలైందో లేదో ఇలా వివాదాలు రాజుకున్నాయి. తన పర్మిషన్ తీసుకోకుండానే 'నానుమ్ రౌడీ డాన్' అనే సినిమాలోని ఫుటేజ్ ని ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారని ఆ సినిమా నిర్మాత, నటుడు ధనుష్... నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. మూడు సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ ను వాడుకున్నందుకు ధనుష్ నష్ట పరిహారంగా ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేశారు.
ఇక 'నానుమ్ రౌడీ డాన్' సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, ఆమె భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ధనుష్ లీగల్ నోటీసులకు నయనతార తీవ్రంగా స్పందించింది. ధనుష్ క్యారెక్టర్ ని తప్పుబడుతూ, సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనపై అతను ద్వేషాన్ని చిమ్ముతున్నాడు అంటూ లీగల్ పోరాటానికి సిద్ధమైంది. అయితే లీగల్ నోటీసులు పంపినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 8 లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని ఇప్పటికే నయన్ దంపతులతో పాటు నెట్ ఫ్లిక్స్ ను కోర్టు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
క్లారిటీ ఇచ్చిన 'చంద్రముఖి' నిర్మాతలు
ఈ నేపథ్యంలోనే తాజాగా 'చంద్రముఖి' సినిమాలోని ఓ క్లిప్ ని డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు, అలాగే నెట్ ఫ్లిక్స్ కి లీగల్ నోటీసులు పంపినట్టు నిన్న నేషనల్ మీడియా కోడై కూసింది. 'చంద్రముఖి' నిర్మాతలు తమ అనుమతి లేకుండా ఆ క్లిప్ ని వాడుకున్నందుకు నష్టపరిహారంగా 5 కోట్లు డిమాండ్ చేశారనేది ఆ వార్తల సారాంశం. తాజాగా అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ 'చంద్రముఖి' టీం స్పందించింది. 'చంద్రముఖి' సినిమాలోని కొన్ని క్లిప్ లను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించడం పై ఆ సినిమా నిర్మాతలు సీరియస్ అయ్యారని వస్తున్న వార్తలన్నీ వట్టి రూమర్స్ అని కొట్టి పారేశారు. నయనతారకు ఎలాంటి నోటీసులు పంపలేదంటూ ;చంద్రముఖి' నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాము 5 కోట్లు డిమాండ్ చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఓ నోట్ ను రిలీజ్ చేశారు. అందులో నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుందని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Also Read: : బ్రహ్మి తనయుడి సర్వైవల్ థ్రిల్లర్‌కు రెండేళ్ల తరువాత మోక్షం... ఓటీటీలో 'బ్రేక్ అవుట్', స్ట్రీమింగ్ ఎప్పుడో తెల్సా?