కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్ (Kiccha Sudeep) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. 'ఈగ' సినిమాతో రాజమౌళి ఆయనను టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఆ సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టిన సుదీప్, ఆ తర్వాత 'బాహుబలి' వంటి పాన్ ఇండియా సినిమాలో కూడా కీలకపాత్రను పోషించి, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కన్నడలో స్టార్ హీరోగా దూసుకెళ్తున్న సుధీప్ రీసెంట్ గా 'మ్యాక్స్' (Max Movie) అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ 'మాక్స్' మూవీ రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వార్త వచ్చేసింది.
'మ్యాక్స్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్
సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మ్యాక్స్'. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మించారు. ఈ సినిమాలో సంయుక్త, సుకృత, సునీల్, అచ్యుత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 'మ్యాక్స్' మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి కన్నడలో మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే 'మ్యాక్స్' మూవీ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి చర్చ మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'మ్యాక్స్' మూవీ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్ నడుస్తోంది. అలాగే ఈ మూవీ జనవరి ఎండింగ్ లో ఓటీటిలోకి రాబోతుందని అంటున్నారు. సాధారణంగా సినిమాలు థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ ఈ సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరి జనవరి 26న ఈ సినిమాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తారా? మేకర్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఏం ప్లాన్ చేస్తున్నారు? అనేది తెలియాలంటే 'మ్యాక్స్' ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.
Also Read: పోలీసులు నోటీసులు ఇచ్చినా తగ్గేదే లే.... నేడు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్!
'మ్యాక్స్' కథ ఏంటంటే...
అర్జున్ ఈ సినిమాలో ఒక పోలీస్ అధికారి. మ్యాక్స్ అని పిలవబడే ఈ అర్జున్ పేరుకే పోలీస్ అధికారి. కానీ జాబ్ విషయంలో సస్పెండ్లు, ట్రాన్స్ఫర్ ల పరంగా ప్రత్యేకంగా రికార్డే ఉంటుంది. ఎప్పటిలాగే ఓ విషయంలో సస్పెండ్ అయ్యి, తిరిగి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ వెళ్లే క్రమంలోనే జాబ్ చేయడం మొదలు పెడతాడు. ఓ మహిళా పోలీస్ తో ఇద్దరు మంత్రుల కుమారులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. అది చూసి అర్జున్ వాళ్ళిద్దర్నీ తీసుకెళ్లి లోపల వేస్తాడు. కానీ ఊహించని విధంగా ఆ ఇద్దరూ పోలీస్ స్టేషన్ లోనే చనిపోతారు. ఆ తర్వాత మంత్రులు ఏం చేశారు? మంత్రులకి మ్యాక్స్ ఎలాంటి సమాధానం చెప్పాడు? అసలు పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారు? ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఏంటి? గని భాయ్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also: ‘బాహుబలి 2’ని దాటవేసిన ‘పుష్ప 2’ - అఫీషియల్‌గా ప్రకటించిన నిర్మాతలు!