Bad Boy Karthik First Look: 'బ్యాడ్ బాయ్ కార్తీక్'గా వస్తున్న నాగశౌర్య... బర్త్ డేకి టైటిల్ అనౌన్స్ చేశారోచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ కూడా

Bad Boy Karthik First Look : నాగశౌర్య బర్త్ డే ట్రీట్ గా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి విష్ చేసింది చిత్రబృందం.

Continues below advertisement

టాలీవుడ్ హీరో నాగ శౌర్య పుట్టినరోజు (Naga Shourya Birthday) నేడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' (Bad Boy Karthik Movie) మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ, నాగ శౌర్య బర్త్ డే ట్రీట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

Continues below advertisement

'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ లుక్... స్పెషల్ విషెస్ 
హీరో నాగశౌర్య ప్రస్తుతం కొత్త దర్శకుడు రామ్ దేశిన దర్శకత్వంలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే సినిమాను చేస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ రోజు నాగశౌర్య పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను అధికారికంగా రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే టైటిల్ ను రివీల్ చేశారు. సినిమాలో నాగశౌర్య పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయం టైటిల్ ద్వారా మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో నాగశౌర్య గతంలో ఎన్నడూ లేని విధంగా వైల్డ్ గా కనిపించారు. వ్యాన్ వెనక భాగంలో కూర్చుని, చేతులకు రక్తం కారుతుండగా, నుదుటిపై అదే రక్తాన్ని విభూదిలా పెట్టుకుని సీరియస్ లుక్ లో దర్శనమిచ్చారు. ఆ వ్యాన్ లో 'హైదరాబాద్' అని రాసి ఉన్న అక్షరాలలో 'బ్యాడ్' అనే పదాన్ని ప్రత్యేకంగా హైలెట్ చేసి చూపించారు. అంటే మూవీ అంతా బ్యాడ్ అనే కాన్సెప్ట్ తోనే నడుస్తుందనే విషయం అర్థంఅవుతోంది. మొత్తానికి నాగశౌర్య యాక్షన్ జానర్లో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే సినిమాను చేస్తున్నట్టు అర్థమవుతుంది. 

Also Read: 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?

షూటింగ్ చివరి దశలో...
ఇక  'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమాలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సీనియర్ నరేష్, సముద్రఖని, సాయికుమార్, వెన్నెల కిషోర్, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీష్ జయరాజ్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సైలెంట్ గా మేకర్స్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా షూటింగ్ ను కానిచ్చేస్తున్నారు.

ఇక చిత్ర బృందం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో నాగ శౌర్య పుట్టినరోజున ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. త్వరలోనే రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా నాగశౌర్య గత సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ మూవీపైనే శౌర్య బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: అఖిల్ అక్కినేని పెళ్లికి ముహూర్తం ఫిక్స్... వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు తెలుసా?

Continues below advertisement