Afzalgunj firing: అఫ్జల్​గంజ్​లో కాల్పులకు పాల్పడ్డ దుండగులు ఎలా పారిపోయారంటే..?

అఫ్జల్‌గంజ్‌ కొద్దిరోజుల క్రితం దుండగులు కాల్పులకు పాల్పడి కలకలం సృష్టించిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

Continues below advertisement

అఫ్జల్‌గంజ్‌ కొద్దిరోజుల క్రితం దుండగులు కాల్పులకు పాల్పడి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించారు. కీలక ఆధారాలు సేకరించారు. వారు ఎక్కడి నుంచి ఎటు పారిపోయారన్నది గుర్తించారు. కాల్పులకు పాల్పడిన దుండగులు అనంతరం తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్‌పేట్‌ వరకు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్‌ వరకు లారీలో ప్రయాణించినట్లు తేల్చారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్‌కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. 

Continues below advertisement

తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ పోలీసులపై కాల్పులు
బీదర్​లో చోరీ.. అఫ్జల్​గంజ్​లో కాల్పులు.. కర్ణాటక బీదర్‌లోని ఓ ఏటీఎం సెంటర్​లో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఒకరిని కాల్చి చంపి వారి వద్ద ఉన్న రూ.93 లక్షలతో బైక్​పై అక్కడి నుంచి ఉడాయించారు. అక్కడి నుంచి హైదరాబాద్​లోని అఫ్జల్​గంజ్​కు వచ్చి తలదాచుకున్నారు. అయితే వారు ఇక్కడ ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్​కు వచ్చారు. అయితే ఆ దుండగులు అప్జల్‌గంజ్‌లో కర్ణాటక పోలీసులను పసిగట్టిన దుండగులు.. వారిని తప్పించుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపారు. అనంతరం ఓ ట్రావెల్స్‌ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు కాల్పులు జరుపుతుండగా.. ట్రావెల్స్‌ మేనేజర్‌ కు గాయాలయ్యాయి.

బిహార్‌తో పాటు ఝార్ఖండ్‌లో గాలింపు
కాగా ఆ ఇద్దరు నిందితులను అమిత్, మనీశ్‌గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు బీదర్, హైదరాబాద్‌ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి జల్లెడ పడుతున్నారు. వారికోసం ఇప్పటికే పోలీసులు బిహార్‌తో పాటు ఝార్ఖండ్‌కు చేరుకొని అక్కడి పోలీసుల సహకారంతో విస్తృతంగా గాలిస్తున్నారు.

Continues below advertisement