Facts About Naga Sadhu and Aghora :  జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా మహాశివరాత్రి వరకూ ఉంటుంది. దాదాపు ఈ 45 రోజుల్లో రాజస్నానాలు ఆచరించేందుకు ముఖ్యమైన తిథులుంటాయి. వాటిలో మౌని అమావాస్య ఒకటి. జనవరి 29 మౌని అమావాస్య వచ్చింది. ఈ రోజు భక్తులు మాత్రమే కాదు.. లెక్కకు మించి నాగసాధువులు, అఘోరాలు గుంపులుగా వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరించి వెళ్లిపోతారు. ఇంతకీ అఘోరాలు, నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఎలా వస్తారు?


బస్సులలో రారు


రైళ్లలో కనిపించరు


ఏ రోడ్లపైనా తిరుగుతూ కనిపించరు


ఎక్కడో హిమాలయాల్లో ఉండేవారంతా ఒక్కసారిగా గుంపుగా ఎలా వచ్చేస్తారు


మహా కుంభమేళా జరుగుతోంది.. 45 రోజుల పాటూ జరిగే ఆధ్యాత్మిక ఉత్సవం కొనసాగుతోంది..


మొదటి పదిరోజుల్లో పలు సందర్భాల్లో నాగసాధువులు, అఘోరాలు కుంభమేళాలలో సడెన్ గా ప్రత్యక్షమయ్యారు..


వాళ్లకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలన్నీ కుంభమేళాల జరిగిన ప్రదేశం నుంచే కానీ.. ఏ రోడ్డుమీదో, వాహనంలోనో కాదు..


ఎక్కడో హిమాలయాల్లో ఉంటూ నిత్యం భగవంతుడి ఆరాధనలో ఉండే వీరంతా మరి ఎలా వస్తున్నారు? 


Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!


ఈ ప్రశ్నకు సమాధానమే.. నాగసాధువులు, అఘోరాలకు మాయమయ్యే శక్తి ఉంది అని.. వీరికి ఆకాశ గమనం తెలుసు. అంటే ఆకాశ మార్గంలో వచ్చి వారు చేరాలి అనుకున్న ప్రదేశంలో అడుగుపెట్టి..ఆ తర్వాత పుణ్యస్నానం ఆచరించి మళ్లీ గుంపుగా వెళుతూ వెళుతూ ఓ ప్రదేశానికి వెళ్లగానే కనిపించరు. అంటే అక్కడి నుంచి ఆకాశమార్గంలో వెళ్లిపోతారు.


ఆకాశగమనం గురించి చెబుతున్నారు మీరు చూశారా అంటే.. స్కాంద పురాణం, వరాహ పురాణంలో ఆకాశ గమనం గురించి స్పష్టంగా ఉంది. అంటే వీరి ప్రయాణం మొత్తం ఆకాశ మార్గంలోనే సాగుతుంది. వారి శక్తి అలాంటిది.  ఇలా మొదట ఆకాశగమనం చేసింది నారదుడు. 


అఘోరాలు, నాగ సాధవులు ఎక్కడుంటారు?


తక్షశిల, వారణాసి, గౌహతి అడవులు, హిమాలయాల్లో రెండు ప్రదేశాలు...మొత్తం ఈ ఐదు ప్రదేశాల్లో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్లకి ఎలాంటి ఫోన్లు, సమాచారం అందించుకునే సదుపాయాలు ఉండవు కానీ...ఒకరి నుంచి మరొకరికి.. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారం చాలా సులభంగా చేర్చుకుంటారు. ఒకరి నుంచి మరొకరు సమాచారం తెలుసుకుని ఓ చోట చేరిపోతారు. 


Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!


అఘోరాలకు 5 విభాగాలున్నాయి..ప్రతి విభాగానికి కొన్ని నియమాలుంటాయి.. మీరు ఏ విభాగంలో చేరాలి అనుకున్నా అందుకు తగిన నియమాలు పాటించాల్సిందే..గురువు ఆజ్ఞను పాటించాల్సిందే..


ఎవరంటే వాళ్లు వెళ్లి అఘోరాగా మారే అవకాశం ఉండదు.


తక్షశిల విభాగంలో ఒకప్పుడు అఘోరాగా మారేందుకు వెళ్లిన వ్యక్తిని శూలంపై కూర్చోమన్నారు గురువు..ఏళ్ల తరబడి శూలంపైనే ఉండిపోయాడాయన...


మెడనిండా పాములు, రుద్రాక్షలతో వళ్లంతా నిండిపోయి కనిపిస్తారు మరికొందరు. అది కూడా గురువు ఆజ్ఞే..తిరిగి గురువు చెప్పేవరకూ వాటిని తమ శరీరంపైనుంచి తీయరు. వారి జీవనం వాటితోనే..


 ఇలాంటి కఠినమైన దీక్షలు చేస్తారు..నిత్యం ఆ పరమేశ్వరుడి ఆరాధనలోనే ఉంటారు. అందుకే కుంభమేళాకు వెళ్లిన భక్తులకు వీళ్లు కనిపిస్తే దూరం నుంచి నమస్కరించండి చాలు. ఎందుకంటే గడ్డకట్టే చలిలో ఒంటిపై వస్త్రాలు కూడా లేకుండా తపస్సు ఆచరిస్తారు. ఇలాంటి వారి దర్శనమే మహాభాగ్యం. అందుకే చూడగానే నమస్కరించండి కానీ కాళ్లపై పడి వాళ్లని ఇబ్బంది పెట్టకండి. 


Also Read: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 09 వరకూ మీ రాశిపై బుధుడి ప్రభావం.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం!


ఈ నెల 29 న మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు మహాకుంభమేళాకు తరలివస్తారని అధికారులు అంచనా. ఆ ఒక్కరోజే 10 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారనే అంచనా..అందుకే ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశం నలుమూలన నుంచి 150 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఏడాదిలో వచ్చే 12 అమావాస్యలలో పుష్యమాసంలో వచ్చే అమావాస్య పితృకార్యాలకు అత్యంత శ్రేష్టమైనది.