TGTET 2024 Answer Key: తెలంగాణలో టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ జనవరి 24న విడుదల చేసింది. పేపర్లు, సబ్జెక్టులవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా పొందుపరిచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు జనవరి 25 నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, పేపరు వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల నమోదుచేయవచ్చు.
ఫలితాలు ఎప్పుడంటే?
టెట్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ జనవరి 24న ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2న ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET)) జనవరి 20 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1, 2 కలిపి మొత్తం 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,05,278 మంది (74.44 శాతం) పరీక్షలకు హాజరయ్యారు.
టెట్ ఆన్సర్ కీల కోసం క్లిక్ చేయండి..
రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
ఆన్సర్ కీపై అభ్యంతరాల నమోదుకు క్లిక్ చేయండి..
పేపర్లు, తేదీలవారీగా టెట్ ఆన్సర్ కీలు..