Mercury Transit in Capricorn 2025: మాటలు, తెలివితేటలు, వ్యాపారంలో లాభాలకు కీలకంగా పరిగణించే గ్రహం బుధుడు. గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడు మిగిలిన గ్రహాల కన్నా త్వరగా రాశిమారుతాడు. జనవరి 23 నుంచి ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 09 వరకూ ఇదే రాశిలో ఉండి ఆ తర్వాత కుంభ రాశిలోకి పరివర్తనం చెందుతాడు. ఈ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో చూద్దాం..
మేష రాశి
బుధుడి సంచారం సమయంలో ఈ రాశి ఉద్యోగులకు అనుకూల పరిస్థితులుంటాయి. మిత్రుల సహకారంతో మీ పనులు సఫలమవుతాయి. మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే ఇదే మంచి టైమ్. కుటుంబ పెద్దలతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.
వృషభ రాశి
ఈ రాశివారికి బుధుడి సంచారం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ఉన్నాతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. మీరు పనిలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదు.
మిథున రాశి
ఇతరులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదు. ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. మీకు టైమ్ లో అంతగా అదృష్టం కలసరాదు. రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెట్టకండి. మీరు ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ పాలసీల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు
Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!
కర్కాటక రాశి
ఈ సమయంలో వ్యాపారులకు కలిసొస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. మీ పని శైలిలో పెద్ద మార్పులు చేయవచ్చు. ఉన్నత విద్యలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. . అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి.
సింహ రాశి
బుధుడి సంచారం సింహ రాశివారికి లాభాలపంట పండిస్తుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ప్రభుత్వ పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. వాతావరణంలో మార్పుల వల్ల అలర్జీ, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రుణ లావాదేవీలు నష్టానికి దారితీయవచ్చు.
కన్య రాశి
వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు కుటుంబంలో సరైన సమన్వయం ఏర్పడే అవకాశం ఉంది. మీరు మీ పని శైలిని మెరుగుపరచుకోవచ్చు. సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఉద్యోగం పొందడం సులభం అవుతుంది.
తులా రాశి
పెట్టుబడులు పెట్టేందుకు ఇదే రైట్ టైమ్. ఇంటికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాటతీరుతో ఇతరులను ఆకర్షిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు.
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
వృశ్చిక రాశి
ఈ రాశివారు తీర్థయాత్రలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాపారంలో ప్రత్యర్థులతో విభేదాలు వస్తాయి. మాటల్లో మృదువైన పదాలు వినియోగించండి. సాహిత్యం, సినిమాలతో సంబందం ఉన్న వ్యక్తులకు అదృష్టం కలిసొస్తుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండాలి
ధనస్సు రాశి
వ్యాపార సంబంధిత నిర్ణయాలకు ఇది చాలా అనుకూలమైన సమయం. మీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. మీరు మీ పూర్వీకుల వ్యాపారంలో కొన్ని మార్పులు చేయవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు
మకర రాశి
ఈ రాశివారికి నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కానీ మీరు చాలాసార్లు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులు మీ మాటలను వ్యతిరేకించవచ్చు. మోకాళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి
గురువుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు చేయండి. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. ఫిబ్రవరి మొదటి వారంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొంతమంది పిల్లల గురించి ఆందోళన చెందుతారు.
మీన రాశి
ఈ రాశివారు కళ , సంస్కృతిపై గొప్ప ఆసక్తిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో మీ స్థానం పెరగవచ్చు. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. మీరు రచన , లలిత కళల వైపు ఆకర్షితులవుతారు. కొన్నిసార్లు తప్పుడు ధోరణుల వైపు మళ్లవచ్చు. మీ భావాలను అందరి ముందు ప్రదర్శించవద్దు.
Also Read: మౌని అమావాస్యరోజు రాజస్నానం ఇలా చేయాలి - కుంభమేళాలో ఈరోజు అత్యంత ప్రత్యేకం!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.