Ratha Saptami Signiicance: దేవుడు లేడు అనేవారున్నారు..కానీ..వెలుగు, వేడి లేవని..వాటికి కారణం అయిన సూర్యుడు లేడని ఎవరూ చెప్పలేరు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. భూమ్మీద ఉండే జీవుల చావు, పుట్టుకకు, పోషనకు , కాల నియమానికి, ఆరోగ్యం, వికాసానికి మూలం ఆదిత్యుడు. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు. ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడిని భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా పూజించేవారెందరో. ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన తర్వాత..రెండు పర్వదినాలు జరుపుకుంటారు. మొదటిది సూర్యుడు దిశమారినందుకు సూచనగా చేసుకునే మకర సంక్రాంతి.. రెండోంది సూర్యుడి జన్మతిథి అయిన రథసప్తమి.  


Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!


ఈ ఏడాది 2025 లో రథసప్తమి ఫిబ్రవరి 04 న వచ్చింది...


అయితే సూర్యోదయానికి సప్తమి తిథి లేకపోవడంతో రథ సప్తమి ఎప్పుడు అనే గందరగోళం నెలకొంది..


ఫిబ్రవరి 04 మంగళవారం ఉదయం  7.55 వరకూ షష్టి తిథి ఉంది... ఆ తర్వాత సప్తమి తిథి మొదలైంది


ఫిబ్రవరి 04 రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి 05 బుధవారం తెల్లవారుఝామున 5.29 వరకూ ఉంది... ఈ రోజు సూర్యోదయ సమయం 6.36... అంటే సూర్యోదయం అయ్యేకన్నా ముందే సప్తమి తిథి వెళ్లిపోయి అష్టమి మొదలవుతోంది. 


అందుకే ఫిబ్రవరి 04 మంగళవారమే రథ సప్తమి జరుపుకోవాలి...ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు...


సూర్యుడిని ఎందుకు పూజించాలి?


ఉదయం నుంచి సాయంత్రం వరకూ తన విధి నిర్వహణలో సూర్యుడు ఎప్పుడూ వేళను అతిక్రమించడు


Also Read: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 09 వరకూ మీ రాశిపై బుధుడి ప్రభావం.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం!
 
సృష్టిలో ఉండే సంపదకు, ఆహారానికి సూర్యుడే మూలం..సంపదంతా సూర్యుడు ప్రసాదించినదే. మునులకు ఆహారం అందించేందుకు ధర్మరాజు ఇబ్బందిపడుతుంటే అక్షయపాత్ర అందించింది సూర్యుడే. సత్రాజిత్తు అనే రాజుకి శమంతకమణిని ప్రసాదించింది సూర్యుడే..ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది


వేద విద్యలకు, వికాసానికి  విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించేది సూర్యుడే. ఆంజనేయుడు వేద విద్యలు అభ్యసించింది సూర్యుడి దగ్గరే. 
 
శరీరంలో ఉండే 24 తత్వాలను సూర్యకాంతితో మేల్కొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందంటారు మహర్షులు. 


పంచభూతాల్లో ఆకాశం, అన్ని..ఈ రెండింటిలో ఆకాశం వల్ల శబ్ధం ఉత్పన్నమవుతుంది, అగ్నివల్ల వెలుగు వేడి పుడుతుంది. శరీరంలో ఉండే ఆరు చక్రాలను పై నుంచి కిందవరకూ వెలుగు చైతన్యపరుస్తుంది..శబ్ధం కింది నుంచి పైకి చైతన్యపరుస్తుంది. 


సూర్యనమస్కారాలు, సూర్య ఆసనాలవల్ల సూర్యుడి నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది.  


అందుకే ప్రత్యక్షనారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరిపోవడంతో పాటూ ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తుంది...


Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!
 
"ఓం హ్రీం సూర్యాయ నమః"


సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్


గమనిక: కొందరు పండితులు, ప్రవచన కర్తలు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం