Kumbh Mela 2025: పుణ్యంకోసం రద్దీగా ఉండే ప్రదేశాలకు పరిగెత్తకండి.. ఏదైనా జరిగితే రాజకీయ నాయకులని, పోలీసులని, ప్రవచనకర్తలని బాధ్యులను చేయకండి. అక్కడి పరిస్థితిని బట్టి మీ బాధ్యత మీరు చూసుకోండి. సంధ్య థియేటర్ తొక్కిసలాట అయినా, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట అయినా, గతంలో పుష్కరాల సమయంలో జరిగే తొక్కిసలాట అయినా..అలాంటి ప్రదేశాలకు వెళ్లేముందు ఆలోచించండి. ఇలా చేస్తే మంచిది అని మాత్రమే పురాణకర్తలు చెబుతారు...అంతే కానీ అక్కడ పరిస్థితిని బట్టి వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది మీరే..
క్షీరసాగరమథనంలో నారాయణుడు అమృత భాండాన్ని రాక్షసులు లాగేసుకుంటే ఇంద్రుడి కుమారుడు జయంతుడు దాన్ని తీసుకుని భూమిపైకి వచ్చాడు. దాన్ని కాపాడేందుకు పన్నెండేళ్లు భూమిపై తిరిగాడు..అప్పుడు ఆ అమృత భాండం నుంచి నాలుగు ప్రదేశాల్లో నాలుగు చుక్కలు పడ్డాయని స్కాంద పురాణంలో ఉంది. ఆ ప్రదేశాలో ప్రయోగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని.
Also Read: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 09 వరకూ మీ రాశిపై బుధుడి ప్రభావం.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం!
ఏటా ప్రయాగరాజ్ లో మాఘమాసంలో నిర్వహించే క్రతువు మాఘమేళా అంటారు. సాధారణంగా మాఘమాసంలో నదీస్నానం ఆచరించాలంటారు. ఆ స్నానం ప్రయాగరాజ్ లో చేస్తే మరింత పుణ్యం..
ఆరేళ్లకోసారి అర్థకుంభమేళా అని జరుగుతుంది..ఇది ప్రయాగరాజ్, హరిద్వార్ లో జరుగుతుంది
పూర్ణకుంభమేళా 12 ఏళ్లకు ఓసారి... ప్రయోగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో జరుగుతుంది
రాశుల్లో బృహస్పతి సంచారాన్ని అనుసరించి పన్నెండేళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి...
ఇలాంటి 12 పూర్ణ కుంభమేళాలు జరిగితే 144 ఏళ్లకోసారి వచ్చేది మహా కుంభమేళా..అది కేవలం ప్రయాగరాజ్ లో జరుగుతుంది. ఇప్పుడు జురుగున్నది మహా కుంభమేళా..
నాలుగు ప్రదేశాల్లోనూ అమృతం పడినా ప్రయాగకే ఎందుకంత ప్రాముఖ్యత అంటే... అక్కడ త్రివేణి సంగమం ఉంది, బ్రహ్మదేవుడు మొదట యజ్ఞం చేసిన ప్రదేశం, పది అశ్వమేథయాగాలు జరిగిన ప్రదేశం అది..అందుకే ప్రయాగ అనరు..ప్రయాగ రాజ్ అని గౌరవంగా పిలుస్తారు.
కుంభమేళాకి వెళ్లినవారు...సంకల్పం చెప్పుకుని స్నానం ఆచించండి. నాగ సాధువులు కనిపిస్తే దూరం నుంచి నమస్కరించండి..వారి కాళ్లపై పడి ఇబ్బంది పెట్టకండి. నాగ సాధువులకు సంబంధించి ఓ కథ ఉంది. శంకరాచార్యలు కాలంలో పాషండులు దేవాలయాను ధ్వంసం చేస్తుంటే ఆ సమయంలో శంకరాచార్యులు ఓ గ్రూపును తయారు చేశారు. వారిని మంత్ర, తంత్ర, ఆయుధ ప్రయోగాలు అన్నీ నేర్పించారు. అప్పట్లో రాజులకు యుద్ధంలో సహాయం చేసేవారట నాగసాధవులు. గడ్డకట్టే హిమాలయ చలిలోనూ ఒంటిపై వస్త్రాలు లేకుండా తపస్సు చేసుకుంటారు.ఇలాంటి వారి దర్శనమే మహా భాగ్యం..వారికి నమస్కరించండి.
ప్రయాగ వెళ్లేవారంతా అలోపి మాతను దర్శించుకోండి. ఇదో శక్తి పీఠం. చిన్న ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తారు.. గర్భగుడిలో ఓ వేదికపై ఉయ్యాల ఉంటుంది.
పెద్దలకు పిండ ప్రదానం చేయండి లేదంటే మీ కుటుంబంలో స్వర్గస్తులైన వారిని తలుచుకుని తర్పణాలు అర్పించండి.
Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!
కుంభమేళాలో దాన ధర్మాలు చేయడం అత్యుత్తమం. ప్రయాగలో వేణి దానం అనే ప్రక్రియ ఉంది.. భార్యను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె జుట్టుని దానం చేసే ప్రక్రియ. జీవితకాలంలో ఒక్కసారి చేసే దానం ఇది.
పుష్కరాల సమయంలో ఏదైనా ప్రత్యేక రోజులు వస్తే ఆ రోజుల్లో పుష్కరస్నానం ఆచరించడం మంచిదే..అవకాశం ఉండి, రిస్క్ తీసుకుంటాం అనుకుంటే వెళ్లండి కానీ.. అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్లకపోవడమే మంచిది. పుష్కరస్నానం పేరుతో లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకోకండి..
మీ సమీపంలో ఉన్న నదుల్లో, బావుల దగ్గర లేదంటే ఇంట్లో స్నాన మాచరిస్తూ...
గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరి జలేయస్మిన్ సన్నిధిం కురు। ।
అని చదువుకోండి చాలు... ఆయా నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం వస్తుంది...
ఫిబ్రవరి 26 శివరాత్రి మహాకుంభమేళా ఆఖరి రోజు...
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!