Trinayani Serial Today Episode తిలోత్తమ సుమన, వల్లభలతో తాను పొరపాటున చనిపోతే తన ఆస్తి మొత్తం సుమనకు వెళ్లేలా చేస్తున్నానని చెప్తుంది. సుమన మనసులో చాలా సంతోషపడుతుంది. మరోవైపు దురంధర ఏడుస్తుంటే నయని, విక్రాంత్, పావనా అక్కడ ఉంటారు. తిలోత్తమకు అమ్మను అవ్వడం ఇష్టం లేదని అందుకే బాధ పడుతున్నానని దురంధర ఏడుస్తుంది.
విక్రాంత్: అత్తయ్య మా అమ్మ దుర్భుద్ధితో దుర్మార్గమైన పనులు చేసి చివరకు గాయత్రీ పెద్దమ్మ చేతిలో చావక తప్పదు. అలాంటిది నీ కడుపులో పుట్టబోతుంది అంటే అది దైవ నిర్ణయమే కదా.
పావనా: అవును దూర్ అంతా దేవుడి నిర్ణయమే కదా.
దురంధర: ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి చేస్తాను.
విక్రాంత్: డెలివరీ. ఈ రోజు అని కాదు రేపు అయినా మేం చెప్పినట్లు చేయాలి అత్తయ్య.
దురంధర: అలాగే. నయని మేం అనుకున్న ప్లాన్ అని ఏదో దురంధర వాళ్లతో చెప్తుంది.
విక్రాంత్: ఇలా చేస్తే తప్పు మా అమ్మ బ్రో వాళ్లు నమ్మరు.
నయని: అక్కడికి వెళ్తేనే వాళ్లు నమ్ముతారు.
దురంధర: తప్పదు కదా
విక్రాంత్: నలుగురం సైలెంట్‌గా ఉండాలి లేదంటే మా అమ్మ పసిగట్టేస్తుంది.
తిలోత్తమ చీరలు ముందు వేసుకొని వాటిలో ఓ చీర మీద బాస్వరం పొడి చల్లుతుంది. గాయత్రీ పాప అది చూస్తుంటుంది. ఆ చీర నయని కట్టుకునేలా చేసి మంట పెట్టాలని వల్లభతో చెప్తుంది. అదంతా గాయత్రీ పాప విన్నదని చూసిందని తిలోత్తమ వల్లభతో చెప్తుంది. కావాలనే పాప చూడాలనే అలా చేస్తుంది. పాప చూసేలా మరో చీర నాది నేను కట్టుకొని వస్తానని అంటుంది. తిలోత్తమ, వల్లభలు వెళ్లి చాటుగా పాప ఏం చేస్తుందా అని చూస్తుంటారు. పాప వెళ్లి తిలోత్తమ కట్టుకుంటా అన్న చీర మీద ఆ పొడి చల్లుతుంది. తిలోత్తమ, వల్లభ మొత్తం చూస్తుంటారు. పాప చూసేలా కావాలనే అదంతా చేశానని అంటుంది. ఆ చీర నేను కట్టుకుంటా అన్నందుకే పాప ఆ చీర మీద పొడి చల్లిందని అంటుంది తిలోత్తమ. పాప రావడం చూసి నయనిక కట్టుకుంటుంది అన్న చీర అక్కడే పడేస్తుంది.
పాప ఆ చీర చూసి దాని మీద నీరు పోస్తుంది. ఇంతలో నయని వచ్చి ఆ చీర తీసుకుంటుంది. చీర తడిచిపోయిందని ఇలా చేయకూడదని అంటుంది. ఆ చీరని ఆరేసి వస్తానని నయని చెప్పి పాపని హాల్‌లోకి వెళ్లమని అంటుంది. ఇక తిలోత్తమ బామ్మని పిలిచి గాయత్రీ పాప పొడి వేసిన చీరని బామ్మకి ఇస్తుంది. బామ్మతో మంచిగా మాట్లాడి చీర ఇస్తుంది. బామ్మ తిలోత్తమ నటనకు చాలా సంబరపడిపోతుంది. తిలోత్తమ ఆ చీరని ఈ రోజే కట్టుకొని తన ముందు తిరగమని చెప్తుంది. బామ్మ సంతోషంతో ఇప్పుడే కట్టుకుంటా అని చెప్పి వెళ్తుంది. తిలోత్తమ మనసులో గాయత్రీ పాపని డైవర్ట్ చేయడానికే ఇలా చేశానని అనుకుంటుంది.
ఇక వల్లభ హారతి పట్టుకొని సందడి చేస్తాడు. అందరూ హాల్‌లోని వల్లభ దగ్గరకు వస్తారు. పాప తిలోత్తమ వేరే చీరలో రావడం చూసి షాక్ అయిందని వల్లభ అంటాడు. బామ్మని చీరలో చూస్తే పాప షాక్ అయిపోతుందని అనుకుంటారు. ఇంతలో బామ్మ తిలోత్తమ ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. అందరూ చీర బాగుందని బామ్మతో చెప్తారు. తిలోత్తమ ఇచ్చిందని బామ్మ చెప్తుంది. అందరూ ఇప్పుడెందుకు ఇచ్చారని అడుగుతారు. బామ్మ గారు మన ముందు అలా ఉంటే మనకు సంతోషంగా ఉంటుందని ఇచ్చానని అంటుంది. ఇక వల్లభ అందరికీ హారతి ఇస్తానని అంటాడు. దేవుడి దగ్గర దీపారాధన చేసి హారతి ఇచ్చుంటే బాగుండేది అని నయని అంటే అందరూ నోరెళ్లబెడతారు. దీపారాధన చేయకుండా హారతి ఇవ్వడం ఏంటి అని బామ్మ అడుగుతుంది. దీపారాధన చేయని హారతి తనకు వద్దని బామ్మ అనేస్తుంది. వల్లభ హారతి తీసుకోమని బలవంతం చేయడంతో పాప బొమ్మని పళ్లెం మీదకు విసిరేస్తుంది. వల్లభ కాలు కాలుతుంది. పెద్దావిడ చెప్తున్నా వినకుండా మొండిగా చేసిన వల్లభకు పాప బుద్ధి చెప్పిందని నయని, విక్రాంత్ అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!