Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న హాస్పిటల్‌కి వెళ్లి దాసుని ఎవరు కాపాడారో తెలుసుకోవాలని లేదంటే తానే పోలీసులకు దొరికిపోతానని అనుకుంటుంది. ఇంతలో పోలీసులు ఇంటికి వస్తారు. జ్యోత్స్న చాలా కంగారు పడుతుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. దాసు కనిపించడం లేదని కాశీ కంప్లైంట్ ఇచ్చాడని తర్వాత దాసు దొరకడంతో ఇంటి వాళ్లకి అప్పగించామని దాసు తల మీద దెబ్బలు చూస్తే ఎవరో బలంగా కొట్టారని మాకు అనుమానంగా ఉందని దాసు కనిపించని ముందు రోజు ఈ ఇంటికే వచ్చారని పోలీసులు చెప్తారు. పోలీసులకు అనుమానం వచ్చేసిందని జ్యోత్స్న అనుకుంటుంది.
దశరథ్: మనసులో ఛా జ్యోత్స్న దొరికిపోయింది. ఇప్పుడెలా. ఈ ఇంటికి ఆ మనిషి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు హత్యాప్రయత్నం చేసింది జ్యోత్స్ననే అని కనిపెట్టలేరా. జ్యోత్స్న చేసింది తప్పే కానీ ఇప్పుడు జ్యోత్స్నని కాపాడాలి. ఎస్.
శివనారాయణ: పారిజాతం జ్యోత్స్నని కలిశావా.
పారు: లేదండి వాడిని కలిసి వారం అయింది. వస్తే నన్ను కలవకుండా ఉంటాడా.
శివనారాయణ: విన్నారా వాడు ఈ ఇంటికి వస్తే వాళ్ల అమ్మని కలవడానికే వస్తాడు. కలవలేదు అంటే రానట్లే.
పోలీసులు: లేదండి దాసు ఇక్కడికి వచ్చాడు ఆయన ఫోన్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది.
పారిజాతం: జ్యోత్స్న నీకు ఏమైనా తెలుసా.
శివనారాయణ: దానికి ఎలా తెలుసు. ఇంకా నయం వాడిని కొట్టింది నేనో నా మనవరాలో అని చెప్పలేదు.
దశరథ్: మనసులో అవును నాన్న దాసుని కొట్టింది నీ మనవరాలే. ఇప్పుడు వీళ్లని ఎలా అయినా పంపాలి లేదంటే అందరికీ నిజం తెలిసిపోతుంది. ఏంటి ఎస్‌ఐ గారు దాసు నా తమ్ముడు వస్తే మేం ఎందుకు అబద్ధం చెప్తాం. ఎస్‌పీ గారికి చెప్పాలా.
శివనారాయణ: దశరథ్ ఇప్పుడు మనం మన పరపతి చూపించకూడదు నిజాయితీ చూపించాలి. ఇంట్లో సీసీ టీవీ ఫుటేజ్ ఉంది కదా అది చూస్తే వాళ్లకే అర్థమవుతుంది వెళ్లిపోతారు.
దశరథ్: మనసులో ఎంత పని చేశావ్ నాన్న డైరెక్ట్‌గా సాక్ష్యాలతో నీ మనవరాలిని నువ్వే పట్టించేశావ్. ఇప్పుడు ఫుటేజ్‌లో జ్యోత్స్న దాసుని కొట్టడం చూస్తే నువ్వే గుండె పట్టుకొని పడిపోతావ్ ఇప్పుడేం చేయాలి.
కార్తీక్ ఇంటికి వస్తాడు. దీపం గుమ్మం ముందే నిల్చొని చూస్తుంటుంది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా అని కార్తీక్ అడిగితే మీరు తీసుకెళ్లింది నా ప్రాణాన్ని అని మళ్లీ తీసుకొస్తారని ఎదురు చూస్తున్నానని అంటుంది. కార్తీక్ దానికి నేను మిమల్ని విడదీసినట్లు మాట్లాడుతావేంటి దీప నా కూతురి కోసమే కదా నేను చేసింది అంటాడు. దీప దానికి ఇక్కడ అయితే దానికి ఆకలి వేస్తే నేను తినిపిస్తాను అక్కడ ఎవరిని అడుగుతుంది అని ఏడుస్తుంది. పాప కూడా తల్లీదండ్రులతో తాను దిగిన ఫొటో చూసి ఏడుస్తుంది. ఇంతలో కాశీ పాప్ కార్న్ తీసుకొని వచ్చి శౌర్యకి ఇస్తాడు.హ్యాపీగా శౌర్య తీసుకుంటుంది. కార్తీక్ దీపతో నువ్వు శౌర్యని కడుపులో మోస్తే నేను గుండెల్లో మోస్తున్నా నీ బాధ నాకు కళ్లలో కనిపిస్తుందని అంటాడు. కార్తీక్ ఏడుస్తు నువ్వు ఏం అడిగినా ఈ వారం రోజులు శౌర్య అక్కడే ఉంటుందని అంటాడు. శౌర్యకి ఏమైనా కష్టం వచ్చి అది నేను తీర్చలేకపోతే నేను చచ్చిపోయినట్లే లెక్క అని కార్తీక్ అంటాడు. శౌర్య నా కూతురు దీప కూతురు క్షేమం తండ్రి కంటే బాగా ఇంకెవరికి తెలుసు అని అంటాడు. లోపలికి వచ్చిన కార్తీక్‌ని చూసిన కాంచన, అనసూయతో వాడు అంత మాట అన్నాక ఇంకేం అడుగుతాం అక్క అని అంటుంది.
మరోవైపు దశరథ్ పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తాడు. దాసు వచ్చిన రోజు ఫుటేజ్ జ్యోత్స్న డిలీట్ చేసి ఉంటుంది. దశరథ్ మనసులో దొరికిపోయావ్ అని చాలా భయపడ్డా జ్యోత్స్న తెలివిగా తప్పించుకున్నావ్ అని అనుకుంటాడు. దాసుని నువ్వు ఎందుకు కొట్టావో నిజం తెలుసుకొని తీరుతానని దశరథ్ అనుకుంటాడు. దీప అందరికీ భోజనాలు పెట్టి శౌర్య ఇంట్లో లేదని మర్చిపోయి శౌర్య రావే అని పిలుస్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. శౌర్య ఇంట్లో లేదు కదా అని కార్తీక్ అంటాడు. దీప ఏడుస్తుంది. దీపని చూసి మిగతా వాళ్లు ఏడుస్తారు. ఇప్పుడే అక్కడికి వెళ్దామని దీప గోల చేస్తుంది. వద్దని కార్తీక్ చెప్పినా వినదు. మనసులో కార్తీక్ శౌర్య తినేసి టాబ్లెట్ వేసుకొని పడుకుందని కాశీ మెసేజ్ చేశాడని ఇప్పుడు దీపకి పాప గురించి ఏం చెప్పాలి అని అనుకుంటాడు. ఫోన్ చేయమని చెప్తుంది. దాంతో కార్తీక్ వద్దని అంటాడు. రాత్రి పూట ఫోన్ చేసి దానికి మనం గుర్తు చేస్తే రాత్రంతా మనల్నే తలచుకొని ఏడుస్తుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్!