Satyabhama Serial Today Episode మహదేవయ్య ఇంటికి ప్రచారం కోసం తీసిన ఫొటోలు వస్తాయి. మహదేవయ్యతో పాటు ఇంట్లో వాళ్లు ఫొటోలు చూసి మురిసిపోతారు. భైరవి వెటకారంగా సత్యని పిలిచి ఫొటోలు చూడమని అంటుంది. ఇక ఆ ఫొటోల్లో సత్య ఫొటోలు ఉండటంతో మహదేవయ్య షాక్ అయిపోతాడు. రేణుక సత్యకి ఫొటో చూపించి భలే ఫొటో అని అంటుంది. సత్య వెళ్లి చూస్తుంది. మహదేవయ్య కోపంతో ఫొటోలు విసిరేస్తాడు. ఇంతలో క్రిష్ వచ్చి ఆ ఫొటోలు తీసుకుంటాడు. నందిని సరిగా తీయలేదు అని ఫొటో గ్రాఫర్ తీశాడని క్రిష్ చెప్తాడు. దాంతో మహదేవయ్య తనకు రెండు ఫొటోలు తీసి మొత్తం సత్యవే తీశాడని కోప్పడతాడు. 

భైరవి: చిన్నా నువ్వు మీ బాపుని సపోర్ట్ చేస్తున్నావా మీ సత్యని సపోర్ట్ చేస్తున్నావా. సత్య: మనసులో పాపం నాకు సాయం చేయాలి అని క్రిష్ ఇరుక్కుపోయాడు.క్రిష్: వాడేదో కన్ఫ్యూజ్ అయింటాడు బాపు ఆ చిన్న దానికే ఇంత గొడవ ఎందుకు చూడు నీ ఫొటోలు ఎంత బాగా తీశాడో. ఇప్పుడు పోస్టర్లు చూడు ఎలా అదిరిపోతాయోరుద్ర: రేయ్ సత్య పోస్టర్ల కాంట్రాక్ట్ నువ్వే తీసుకున్నావా అయిన దానికి కాని దానికి తన మీద జాలి పడుతున్నావ్ కదాక్రిష్: ఏంటన్నా నువ్వు కూడా నాకేం పని. ఫొటోలు మంచిగా ఉంటే సత్య గెలిచేస్తుందా. అంత పిరికి వాడిలా మాట్లాడుతున్నావ్. గెలవాలి అంటే ఫాలోయింగ్ ఉండాలి. ఆ క్రేజ్ మా బాపుకే ఉంది. ఆ గ్లామర్ మా బాపుకే ఉంది. బాపు జీపు మీద నిలబడి చేయి ఊపుకొని వెళ్తుంటే వేల మంది జనం వెనకాలే వస్తారు. అది మా బాపు లెవల్. తీసుకో పో ఈ ఫొటోలు ఏం చేస్తావో చేయ్ నువ్వు అసలు మా బాపుకి ఫొటోనే కాదు. సత్య, మహదేవయ్య తప్ప అందరూ వెళ్లిపోతారు.సత్య: హూ.. ఫొటో చూసి అంత భయపడుతున్నారా మామయ్య ఇక నుంచి మీ ఓటర్లు నా వైపు తిరుగుతారు చూస్తూ ఉండండి. 

సత్య, నందిని ఎలక్షన్‌లో ప్రచారం కోపం ఇంటి ఇంటికి తిరిగి ఓటు వేయమని చెప్తే ఎవరూ సత్యకి ఓటు వేయమని అంటారు. అందరూ మహదేవయ్యకే ఓటు వేస్తామని అంటారు. సత్య డిసప్పాయింట్ అవుతుంది. నందినితో అందరూ మహదేవయ్యకే ఓటు వేస్తామని అంటున్నారు అని మంచి వైపు ఉన్న మనకు ఎవరూ సాయం చేయడం లేదని అంటుంది. దానికి నందిని ఎక్కడో ఒక పాజిటివ్ ప్రోత్సాహం వస్తుందని అంటుంది. ఇక మరోవైపు మహదేవయ్య ప్రచారం జోరుగా సాగుతుంది. సత్య, నందిని మాత్రమే ఉండటం చూసి మహదేవయ్య వాళ్లు కిందకి దిగుతారు. క్రిష్ చూసి ఇలాంటి ప్రాచారంతో ఏం గెలుస్తుంది. వెనక నలుగురు కూడా లేరే అనుకుంటారు. మహదేవయ్య వెనక వచ్చిన మహిళలు సత్యతో నువ్వు కుటుంబాన్నే ఎదురిస్తున్నావ్ నువ్వేం లీడర్‌వి అమ్మ నాయకుడు అంటే మహదేవయ్యలా ఉండాలని అంటారు. సత్య చాలా ఫీలవుతుంది. అందరూ మహదేవయ్యకి జిందాబాద్ కొట్టడంతో సత్య డిసప్పాయింట్ అయిపోతుంది. 

మరోవైపు సంధ్య సంజయ్‌ని కలుస్తుంది. తెలీకుండా అక్కకి శత్రువు అయిపోతున్నాను అని అక్క అంటే నాకు ప్రాణం అని అంటుంది. దాంతో సంజయ్ సంధ్యతో నువ్వు మీ అక్కలా పెళ్లి తర్వాత మా ఫ్యామిలీలో చిచ్చులు పెడతావా అని అంటాడు. దానికి సంధ్య నువ్వు నాకు కావాలి సంజయ్ అందుకు ఎవరినైనా ఎదురిస్తానని అంటుంది. సత్యని పోటీలో గెలవకుండా చేయాలని అంటాడు. ఒకవేళ మనం విడిపోతే దానికి కారణం మీ అక్కే అని అంటాడు. నందినితో సత్య ప్రజలు మనల్ని ఎందుకు నమ్మడం లేదని అడుగుతుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం క్రిష్ వింటాడు. సత్య మంచితనం రాజకీయాలకు పనికి రావని కానీ సత్యలాంటి వాళ్లే గెలవాలి అని అనుకుంటాడు. ప్రచారం కోసం అందరూ నాయకుల్లా మనం కూడా నటించాలని నందిని అంటే సత్య నా వల్ల అది కాదు అని నేను ఏం చేసినా సిన్సియర్గా చేస్తానని అంటుంది. దాంతో క్రిష్ మనసులో సత్యని రెచ్చగొట్టి దారిలోకి తీసుకురావాలని అనుకుంటాడు. 

సత్య, నందిని దగ్గరకు వెళ్లి మా బాపులా మీరు పోటీ పడలేరని ఏ ఎండకి ఆ గొడుగు పడితేనే పోటీలో ఉంటావ్ లేకపోతే పోతావ్ అని రెచ్చగొడతాడు. దాంతో సత్య రేపటి నుంచి మీకు కొత్త సత్య కనిపిస్తుందని అంటుంది. ఉదయం మహదేవయ్య వాళ్లు  వైపు ప్రచారం చేస్తుంటే సత్య నందిని ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచుతారు. పాజిటివ్ రెస్పాండ్ రావట్లేదని నందిని అంటుంది. మన వెనకే మా బాపు వాళ్లు ప్రచారం చేస్తున్నారని ఇలా అయితే కష్టం అని నందిని అంటుంది. ఇక సత్య నందిని వెళ్తుండగా ఓ వీధిలో ఒకామె రోడ్లు ఊడుస్తూ ఉంటుంది. ఆమె పడిపోబోతే సత్య, నందిని వెళ్లి పట్టుకుంటారు. ఏమైందని అడిగితే జ్వరం కానీ పని చేయకపోతే పూట గడవదు అంటుంది దాంతో సత్య ఆమెను కూర్చొపెట్టి తానే రోడ్డు ఊడుస్తుంది. ఇంతలో మీడియా అక్కడికి వచ్చి సత్య ఫొటోలు వీడియో తీస్తుంటే సత్య వద్దని అది ప్రచారం కోసం కాదని చెప్తుంది. మీడియాని పంపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్‌.. అయ్యో పాపం అజ్ఞాతశక్తి!