Best Soups for Leg Weakness Relief : నడుస్తున్నప్పుడు కాలు జారడం, శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, కాళ్లలో తిమ్మిరి లేదా తేలికపాటి జలదరింపు వంటివి అనిపిస్తే.. వాటిని తేలికగా తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. ఈ లక్షణాలు విటమిన్ B12 లోపాన్ని (Vitamin B12 Deficiency) సూచిస్తాయని అంటున్నారు. ఎందుకంటే విటమిన్ B12 శరీరంలోని నరాలను బలంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లోపం ఏర్పడినప్పుడు నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. వయస్సు పెరిగేకొద్దీ.. ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపాన్ని మెడికల్ భాషలో సార్కోపెనియా అంటారు. 

Continues below advertisement

విటమిన్ బి12 లోపాన్ని భర్తీ చేసుకునేందుకు.. వైద్య నిపుణులు సరైన ఆహారం తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా B12 అధికంగా ఉండే సూప్‌లు నరాలను రిపేర్ చేయడంలో వేగంగా పనిచేస్తాయని అంటారు. శరీరాన్ని లోపలి నుంచి బలంగా మారుస్తాయంటున్నారు. మరి B12 లోపాన్ని భర్తీ చేయడంలో, కాళ్ల బలహీనత, వణుకును తగ్గించడంలో సహాయపడే 3 సూప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

చికెన్ బోన్ బ్రోత్ సూప్

శరీరంలో విటమిన్ B12ను అందించడానికి చికెన్ బోన్ బ్రోత్ సూప్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని చికెన్ ఎముకలను ఎక్కువసేపు తక్కువ మంట మీద ఉడికించి తయారు చేస్తారు. ఇది నరాలను బలోపేతం చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. ఇందులో విటమిన్ B12, కొల్లాజెన్, అవసరమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న నరాలను రిపేర్ చేస్తాయి. లోపలి నుంచి కండరాలకు శక్తినిస్తాయి. ఈ సూప్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాళ్లలో తిమ్మిరి, బలహీనత, వణుకు తగ్గుతుంది.

Continues below advertisement

పాలకూర సూప్

శరీరాన్ని ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉంచడానికి పాలకూర సూప్ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పోషకాలతో నిండిన పాలకూరలో నైట్రేట్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచి కండరాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో సహాయపడతాయి. పాలకూర సూప్ కాళ్ల బలహీనత, అలసట, తిమ్మిరి వంటి సమస్యలలో త్వరగా ఉపశమనం ఇస్తుంది. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, నైట్రేట్‌లు కాళ్లకు రక్త సరఫరాను పెంచుతాయి. రక్త నాళాలను విస్తరింపజేస్తాయి. కండరాలను బలంగా చేస్తాయి. ఫలితంగా 10–15 రోజుల్లోనే కాళ్లకు శక్తి, కండరాలకు బలం పెరుగుతుంది. 

గుడ్డు సొన సూప్

గుడ్డు సొనతో చేసే సూప్ విటమిన్ B12తో నిండి ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మెదడు చురుకుదనాన్ని అందిస్తుంది. అందుకే ఇది శక్తిని, శరీరాన్ని బలంగా చేసే ఆహార పదార్థాలలో ఒకటిగా పరిగణిస్తారు. గుడ్లు తీసుకోవడం వల్ల మన శరీరంలో, ముఖ్యంగా కాళ్ల కండరాలలో దృఢత్వం పెరుగుతుంది. బలహీనత తగ్గుతుంది. నాడీ పనితీరు మెరుగుపడుతుంది. నడవడంలో స్థిరత్వం, నియంత్రణ పెరుగుతుంది. కాబట్టి వారానికి 2–3 సార్లు గుడ్లు లేదా సొనతో చేసిన సూప్ తీసుకోవాలి. పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.