Jeera Water vs Chia Seeds Water for Weight Loss : నిద్రలేచిన తర్వాత చాలామంది కొన్ని రకాల డ్రింక్స్ తమ రొటీన్లో భాగంగా తీసుకుంటారు. కొందరు నీటిని తాగితే మరికొందరు గోరువెచ్చని నీటిని తీసుకుంటారు. మరికొందరు కాఫీ, టీ తీసుకుంటే మరికొందరు హెర్బల్ డ్రింక్స్ తీసుకుంటారు. అలా ఎక్కువమంది తీసుకునేవాటిలో జీలకర్ర నీరు (Cumin Water) ఒకటి అయితే చీయా సీడ్స్ నీరు (Chia Seeds Water) మరొకటి. అయితే ఈ రెండిటీలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్.. అసలు వీటిని తాగడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చూసేద్దాం.
జీలకర్ర నీటితో లాభాలు (Jeera Water Benefits)
జీలకర్ర నీరు జీర్ణక్రియకు బాగా హెల్ప్ చేస్తుంది. బ్లోటింగ్ తగ్గిస్తుంది. అలాగే మెటబాలీజం కూడా పెంచుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. రుచి కూడా మంచిగా ఉంటుంది.
చియా సీడ్స్ నీటితో కలిగే లాభాలివే (Chia Seeds Water Benefits)
చియా సీడ్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ లాస్‌తో పాటు మజిల్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తాయి. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్, హార్ట్ హెల్త్‌కి మంచిది.
బరువు తగ్గడానికి వీటిలో ఏది మంచిదంటే.. (Which is Best for Weight Loss)
జీరా నీరు తాగితే అది మెటబాలీజం పెంచుతుంది. మెటబాలీజం కెలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కానీ ఇది ప్రధాన ఫ్యాట్ బర్నర్ కాదు. మంచి ఫలితాలు కావాలి.. నిజంగా బరువు తగ్గాలనుకుంటే రెగ్యులర్‌గా వ్యాయామం చేయడంతో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు.
చియా సీడ్స్ నీరు తాగితే ఎక్కువ కాలం ఆకలి కాకుండా ఉంటుంది. దీనివల్ల అవసరం లేని ఫుడ్స్ తీసుకోలేరు. బరువు తగ్గే అవకాశం ఉంది. కానీ దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు. జెల్లా ఉంటుంది కాబట్టి కొందరు దీనిని తాగడానికి ఇష్టపడకపోవచ్చు కూడా.
ఫైనల్ రిజల్ట్
ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ అంటే చియా సీడ్స్ వాటర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గేలా చేస్తుంది. జీరా వాటర్ కూడా మంచి ఫలితాలే ఇస్తుంది కానీ.. బెటర్ రిజల్ట్స్ కోసం మీరు ఉదయాన్నే జీలకర్ర నీరు, సాయంత్రం చియా సీడ్స్ వాటర్ తాగొచ్చు. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమవడంతో పాటు బరువు కూడా కంట్రోల్ అవుతుంది.
అయితే ఏ డ్రింక్ తీసుకున్నా.. బరువు తగ్గేందుకు ఫిట్‌గా ఉందేంకు కచ్చితంగా వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ డ్రింక్స్ అనేవి బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి కానీ.. వీటివల్లే బరువు తగ్గిపోతారని అనుకోకూడదని చెప్తున్నారు. కాబట్టి రోజూ వ్యాయమం చేయాలని.. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంటూ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలని అప్పుడే మంచి ఫలితాలు చూడగలుగుతారని చెప్తున్నారు.