AMVI Exam: తెలుగులోనూ ఏఎంవీఐ 'పేపర్-1' ప్రశ్నపత్రం, దరఖాస్తుకు మరో అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షల ప్రశ్నలను ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
![AMVI Exam: తెలుగులోనూ ఏఎంవీఐ 'పేపర్-1' ప్రశ్నపత్రం, దరఖాస్తుకు మరో అవకాశం APPSC will conduct Assistant Motor Vehicle Inspector 'Paper-1' Exam in Telugu too AMVI Exam: తెలుగులోనూ ఏఎంవీఐ 'పేపర్-1' ప్రశ్నపత్రం, దరఖాస్తుకు మరో అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/d1cda63f40f6724cf1f8d62360bc8f831692249548665522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షల ప్రశ్నలను ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. సబ్జెక్టు ప్రశ్నలు మాత్రం యథావిధిగా ఇంగ్లి్ష్‌లోనే ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు 16న అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతేడాది సెప్టెంబరు 30న ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్లు తెలిపింది. అయితే సరైన అర్హతలు కలిగి, అప్పుడు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆగస్టు 16న ఏపీపీఎస్సీ వెల్లడించింది.
వివరాలు..
* అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (రవాణా శాఖ)
ఖాళీల సంఖ్య: 17 పోస్టులు (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-15)
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్). మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-36 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2), మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 150 మార్కులు, పేపర్-2 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు
దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డుదారులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
జీత భత్యాలు: నెలకు రూ.31,460-రూ.84,970.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21.08.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.08.2023.
ALSO READ:
TSPSC: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం - ఈ తేదీల్లోనే!
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన చేసింది. పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. నిర్ణీత గడువులోగా మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వివరాలు మార్చుకునేవారు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణ తొలి గ్రూప్-3 పరీక్షకు మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)