భారత్‌లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఐరోపాలో మాత్రం రోజురోజుకు పరిస్థితి దారుణంగా ఉంది. ఐరోపాలో తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐరోపా వ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోగా.. 2022 మార్చి నాటికి ఈ సంఖ్య 22 లక్షలకు చేరొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.


సగానికిపైగా..


కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసులు, మరణాల్లో సగానికిపైగా ఐరోపాలోనే ఉంటున్నాయి. గత వారం రోజుల్లోనే ఐరోపావ్యాప్తంగా 4200 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న నాలుగు నెలల్లో పరిస్థితులు ఇలానే ఉంటే మరో 7 లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది.


ప్రస్తుతం అక్కడి ఆసుపత్రులు కూడా కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఐసీయూలకు ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపింది.


బూస్టర్ డోసులు..


ప్రస్తుతం ఐరోపాలో చాలా దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జోరుగా సాగిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా కొవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసులపై కూడా ఆయా దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు బూస్టర్ డోసులను వాడుతున్నాయి. అయితే ఇవి కొవిడ్ వైరస్ నుంచి ఏ మేరకు రక్షణనిస్తాయనే దానిపై శాస్త్రీయ ఆధారాలు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది.


Also Read: Abhinandan Varthaman Update: భారత్‌పై పాక్ అక్కసు.. విమానం ఏం కూలలేదట..! అభినందన్ ఏం చేయలేదట!


Also Read: Punjab Elections 2022: 'కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కానీ ఆ చెత్త మాకొద్దు'


Also Read: Covid 19 3rd Wave: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?


Also Read: Central Vista Project: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై మరో పిటిషన్ తిరస్కరణ.. ఇక లైన్ క్లియర్!


Also Read: Corona Cases: దేశంలో 543 రోజుల కనిష్ఠానికి రోజువారి కరోనా కేసులు


Also Read: Nizamabad: కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరం, కారణం ఏంటంటే..


Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్


Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి  


Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి