దేశంలో వరుసగా మూడు లక్షల కేసులు నమోదువుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3, 37, 704 మంది రోగాన బారిన పడ్డారు. నిన్నటితో పోలిస్తే మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు తెలుస్తోంది.
ఒమిక్రాన్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూ పోతోంది. నిన్న వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ కేసులతో మొత్తం రోగుల సంఖ్య పదివేల ఐదు వందలకు చేరుకుంది.
ఒమిక్రాన్ కేసుల పెరుగుదలని 3.69 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి 21, 13, 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం 5.43శాతంగా ఉంది. రికవరీ రేటు 93.31 శాతం.
మహారాష్ట్రలో 144కేసులు వెలుగు చూశాయి. కొత్తంగా 48, 270 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరవై నాలుగు గంటల్లో ఆ రాష్ట్రంలో యాభై రెండు మంది చనిపోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే రోగుల సంఖ్య రెండు వేల డభ్బై మూడు మంది కొత్తగా చేరినట్టు తెలుస్తోంది.
కేరళలో యాభై నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులోని వారంతా యూఏఈ నుంచి వచ్చిన వారిగా గుర్తించి ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కూడా జోరుగా సాగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో అరవై ఏడు లక్షల మందికి టీకా వేసినట్టు పేర్కొంది. మరో డబ్భై నాలుగు లక్షల మందికి ప్రికాషన్ డోస్ ఇచ్చినట్టు తెలిపింది.
మరోవైపు ఈ మధ్య కరోనా వచ్చిన తగ్గిన వాళ్లకు ప్రికాషన్ డోస్ మూడు నెలల తర్వాత వేయాలని కేంద్రం ఆదేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
Also read: కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు తొమ్మిది చిట్కాలు...
Also read: అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్... ఇమ్యూనిటీ పెరగడంతో పాటూ ఇంకా ఎన్నో లాభాలు
Also read: తిని పడేసే చాక్లెట్ రేపర్‌పై దేవుడి ఫోటో... ఏకిపడేసిన నెటిజన్లు, సారీ చెప్పిన నెస్ట్లే ఇండియా
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు