రాగి పాత్రలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలో రాగి పాత్రల వాడకం కొత్త కాదు, పూర్వం రాగి బిందెల్లోనే నీరు నిల్వ ఉంచేవారు. దీన్నే ‘తామ్రా జల్’ అనేవారు. కానీ అమెరికాలాంటి పాశ్చాత్య దేశాల వారికి రాగి గిన్నెల్లో నీరు నిల్వ ఉంచడం అనేది చాలా ఆశ్చర్యపరిచే అంశం. మన పూర్వీకులు రాగి పాత్రల్లో నీళ్లు తాగేవారు కాబట్టి, ఇప్పుడు కూడా అలాగే నీళ్లు తాగాలి అనుకోవద్దు... అలా ఎందుకు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదం ఏం చెబుతోంది, దానికి సైన్స్ చెప్పే కారణాలేంటో తెలుసుకోవాలి.
బ్యాక్టిరియాలను చంపేస్తుంది
ఇప్పుడంటే మనకు వాటర్ ఫిల్టర్లు, రసాయన ఏజెంట్లు వచ్చాయి. కానీ ఒకప్పుడు అవేవీ లేవు. నీటిని శుభ్రపరిచే ఏకైక ప్రక్రియ రాగి పాత్రల్లో వాటిని నిల్వ ఉంచడం. ఇలా చేయడం వల్ల నీళ్లలోని బ్యాక్టిరియా నశిస్తుందని ఒక నమ్మకం. అది నిజమేనని అధ్యయనాలు కూడా నిరూపించాయి. పదహారు గంటల పాటూ రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిలో వ్యాధికారక బాక్టీరియా అయిన ఇ.కోలి, కలరాకు కారణమయ్యే విబ్రియో కలరా, సాల్మోనెల్లా సూక్ష్మజీవులు పూర్తిగా నశిస్తాయని పరిశోధనల్లో తేలింది. అందుకే ఇంట్లో రాగి బిందె ఉండాల్సిన అవసరం ఉంది.
రాగి అవసరం కానీ...
మన శరీరానికి కూడా కొంచెం రాగి అవసరం. కాపర్ ఆక్సైడ్ అద్భుతమైన యాంటీ బాక్టరియల్ గుణాలు కలదే అయినప్పటికీ, నీటిలో రాగి సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రమాణాల ప్రకారం 1.3 ppm కంటే ఎక్కువగా ఉంటే అది విషపూరితం అయ్యే అవకాశం ఉంది. తక్కువైనా కూడా నష్టమే. ఆహారం ద్వారా తక్కువ స్థాయిలో రాగిని పొందడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాగి పాత్రల్లో నీళ్లు నిల్వ చేసుకుని తాగడం వల్ల బ్యాక్టిరియా రహిత నీటిని తాగడమే కాదు, క్యాన్సర్ నుంచి రక్షణ కూడా పొందచ్చు.
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు
Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...
Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి