నువ్వులు ప్రాచీన కాలం నుంచి భారతీయ ఆహారంలో భాగంగా ఉన్నాయి. కానీ ఆధునిక కాలంలో వీటి వాడకం చాలా తగ్గిపోయింది. కేవలం సలాడ్‌ల మీద టాపింగ్‌గానో, లేక బర్గర్ పైన టాపింగ్‌గానో వాడుతున్నారు. కానీ వీటిని రోజూ తినాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలా అని రోజూ అధికంగా తినకూడదు. కేవలం రెండు స్పూనులు తింటే చాలు. అధ్యయనం ప్రకారం రోజుకు రెండు స్పూనుల నువ్వులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 8 నుంచి 16 శాతం తగ్గుతాయి. మొత్తంగా కొవ్వు శాతాన్ని 8 శాతం వరకు తగ్గిస్తాయి.
ఎలా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి?
చెడు కొలెస్ట్రాల్, టైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడంలో నువ్వులు అత్యంత ప్రభావవంతమైనవి. నువ్వుల్లో లభించే సెసమిన్ చిన్న పేగులో కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటుంది, అలాగే కొలెస్ట్రాల్‌ను తయారుచేయడంలో భాగమైన ఎంజైమ్ పనితీరును కూడా నిరోధిస్తుంది. అలాగే నువ్వుల్లో ఉండే ఆల్ఫాలినోలిక్ ఆమ్లం కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. నువ్వుల్లో లభించే సొల్యుబల్ ఫైబర్ (కరిగే ఫైబర్) రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రెండు మూడు నెలల్లోనే ఈ మార్పు ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మాంగనీస్ అధికంగా ఉంటాయి, చక్కెర తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి చలికాలంలో వీటిని తింటే ఎంతో మేలు. ఆయుర్వేదం ప్రకారం నువ్వులు మధుమేహం, ప్రేగు వ్యాధి, అధిక రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఏ రూపంలో తినాలి?
నువ్వులను ఒక నిమిషం పాటూ వేయించుకుని వంటల్లో భాగం చేసుకోవచ్చు. లేదా సలాడ్ పై రెండు స్పూనుల వేయించిన నువ్వులు చల్లుకుని తినవచ్చు. వంటల్లో నువ్వుల నూనెను ఉపయోగించినా మంచిదే. లేదంటే రెండు స్పూనుల వేయించిన నువ్వులను నోట్లో వేసుకున్నా చాలు. ఏదో రకంగా రోజూ నువ్వులు శరీరంలోకి చేరాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...
Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి
Also read: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది