ప్రపంచదేశాలపై ఒమిక్రాన్ వేరియంట్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడో వేవ్ రూపంలో ముంచుకొచ్చిన ఈ వేరియంట్ చాలా త్వరగా పాకిపోతూ ప్రజల్లో భయాందోళనలు పెంచేస్తోంది. టీకాతో సంబంధం లేకుండా అందరికీ ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఈ సందర్భంలో అన్ని రకాలుగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, వర్కవుట్స్ శరీరంలో వ్యాధిని తట్టుకునే శక్తిని పెంచుతాయి. అలాగే ఆయిల్ మసాజ్ కూడా రోగినరోధక శక్తిని పెంచుకునేందుకు సహాయపడుతుంది. 


ఎందుకు మసాజ్...
ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇవి పోషకాలను శరీరం మొత్తానికి చేరేలా చేస్తాయి. జీవక్రియలో వ్యర్థాలను వడకట్టడంలో సహాయపడతాయి. శరీరంలోని నొప్పి, ఒత్తిడిని తగ్గించేందుకు కూడా మసాజ్ ఉపయోగపడుతుంది. దీని వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే మసాజ్ నుంచి అధిక ప్రయోజనాలు పొందాలంటే ఏ సమయంలో చేయించుకోవాలి? ఏ ఆయిల్ తో చేస్తే మంచిదో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...


ఖాళీ పొట్టతో వద్దు...
ఏమీ తినకుండా ఖాళీ పొట్టతో మసాజ్ చేయించుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రక్రియ జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే మసాజ్ చేయించుకోవాలనుకుంటే ఏదో ఒకటి తిన్నాకే సిద్ధమవ్వండి.  


ఏ నూనె మంచిది?
ఎసెన్షియల్ ఆయిల్స్‌ను మొక్కల భాగాల నుంచి తయారు చేస్తారు. ప్రధానంగా ఆకులు, బెరడు, పువ్వుల నుంచి. ఈ ఎసెన్షియల్ నూనెలు రోగినిరోధక వ్యవస్థలోని కొన్ని భాగాలను ప్రేరేపిస్తాయి, కొన్ని రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. యూకలిప్టస్, లవంగం, లావెండర్, టీట్రీ నూనెలను మసాజ్ చేయడానికి ఉపయోగించాలి. 


ఏ సమయంలో...
రోజులో ఎప్పుడైనా మసాజ్ కు చేసుకోవచ్చు. కానీ అధిక ప్రయోజనాలు పొందాలంటే మాత్రం మీరు ప్రశాంతంగా ఉన్న సమయాన్ని ఎంచుకోవాలి. ఉదయాన్నే మసాజ్ చేసుకుంటే మంచిది. ఆ సమయంలో అందరూ శక్తిమంతంగా, తాజాగా ఉంటారు. ఉదయం వీలు కాకపోతే మధ్యాహ్నం భోజనం పూర్తయిన ఓ గంట తరువాత మసాజ్‌కు వెళ్లినా మంచిదే. 


Also read: తిని పడేసే చాక్లెట్ రేపర్‌పై దేవుడి ఫోటో... ఏకిపడేసిన నెటిజన్లు, సారీ చెప్పిన నెస్ట్లే ఇండియా


Also read: రాగిపాత్రలలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు... ఆయుర్వేదం, సైన్స్ కలిపి చెబుతున్నదిదే


Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.