ఎన్నో మతాలు, కులాలు కలిసిన మనదేశంలో దేవుడు అనే అంశం చాలా సున్నితమైనది. ఆ విషయం తెలిసి కూడా కొన్ని కంపెనీలు ఎందుకో... ప్రజల మనోభావాలతో ఆటలాడుతాయి.  నెస్ట్లే సంస్థ తమ కిట్‌క్యాట్ చాక్లెట్ రేపర్‌పై జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు చిత్రాలను ప్రచురించింది. వాటిని చూసిన నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. చాలా మంది చాక్లెట్లను తిన్నాక వాటిని డస్ట్ బిన్లు, రోడ్లపై పడేస్తారని... అవి  తమకు బాధను కలిగిస్తాయంటూ కొంతమంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా నెస్ట్లే ఇండియాకు చేరేలా చేశారు. 


ఒక ట్విట్టర్ యూజర్ కిట్‌క్యాట్ రేపర్ ఫోటోను పోస్టు చేసి ‘దయచేసి మీ కిట్‌క్యాట్ చాక్లెట్ కవర్లోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమాతల ఫోటోలను తీసి వేయండి’ అని ట్విట్ చేశాడు. మరొకరు యూజర్ ‘మా ఒడిషా సంస్కృతిని, మా దేవుళ్లను కిట్ క్యాట్ ర్యాపర్ పై చూడడం ఆనందంగా ఉంది, కానీ ఒక్కసారి ఆలోచించండి.. చాక్లెట్ తిన్నాక ఆ రేపర్ ఎక్కడికి చేరుతుందో, డస్ట్ బిన్లలో వేస్తారు, రోడ్డుపై పడేస్తారు. వాటిపై నుంచి చాలా మంది నడుస్తారు.’ అని తన బాధకు అక్షర రూపాన్నిచ్చారు. ఇలా చాలా మంది నెటిజన్లు నెస్ట్లే ఇండియాపై తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు. దీంతో ఆ కంపెనీ దిగిరాక తప్పలేదు.



సారీ చెప్పిన సంస్థ
తమకు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని చెబుతూ నెస్ట్లే ఇండియా క్షమాపణులు చెబుతూ ట్వీట్ చేసింది. ఈ చాక్లెట్ల ప్యాకేజింగ్ ను గత ఏడాది ప్రారంభించి, కొన్ని రోజులకే రీకాల్ చేసినట్టు చెప్పింది.  స్థానిక అందాలను అందరికీ పరిచయం చేసేందుకు ట్రావెల్ బ్రేక్ ప్యాక్‌ల పేరుతో వీటిని తయారుచేసినట్టు చెప్పింది. ఒడిశా సంస్కృతిని మరింత మందికి చేరువయ్యేలా చేయాలనూ ఇలా చేసినట్టు తెలిపింది. 


‘మేము ఈ విషయంతో ముడిపడి ఉన్న సున్నిత అంశాలను అర్థం చేసుకున్నాము. మాకు తెలియకుండానే కొందరి మనోభావాలను దెబ్బతీసినందుకు బాధపడుతున్నాము. ఇప్పటికే ఈ ప్యాకెట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాము’ అని ట్వీట్ చేసింది. 



Also read: రాగిపాత్రలలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు... ఆయుర్వేదం, సైన్స్ కలిపి చెబుతున్నదిదే


Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు




Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...


Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.