కొవిడ్‌-19లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికాలో బయటపడిన తర్వాత ప్రపంచం మరోసారి తల్లడిల్లుతోంది. దీన్ని ఎదుర్కొవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే... ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వ్యాక్సిన్లు ఎలా పని చేస్తాయనే పరిశోధనలు మొదలు పెట్టాయి వ్యాక్సిన్ తయారీ సంస్థలు. కరోనా టీకాలు తయారు చేస్తున్న ఫైజర్, భారత్‌ బయోటెక్, మోడెర్నా, గెమాలెయా వీళ్లాంతా ఈ కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలో ఆలోచనలు చేస్తున్నారు. 


ప్రాథమిక అధ్యయనాల ప్రకారం, ఓమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉన్నట్టు గుర్తించారు. డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా స్పీడ్‌తో  వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుత వ్యాక్సిన్‌లు దీనికి సరిపడవని... తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 











దక్షిణాఫ్రికాలో మొదట కనుగొనబడిన ఓమిక్రాన్ వేరియంట్‌కు ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్ ఉండటం వల్ల ఆందోళన కలిగిస్తుంది. దక్షిణాఫ్రికాలో దీన్ని గుర్తించనా 12కుపైగా దేశాల్లో కేసులు ట్రేస్ అయ్యాయి.  అందుకే ఆయా దేశాల ప్రభుత్వాలు  కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. సరిహద్దులు మూసివేసి, ప్రయాణాలపై  ఆంక్షలు పెట్టాయి. 


స్పైక్‌ ప్రొటీన్ ప్రాంతంలో 30కిపైగా మ్యూటేషన్స్‌ కలిగి ఉందీ కొత్తగా గుర్తించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌. దీని వల్ల బాడీలో ఇమ్యూన్‌ దెబ్బతింటుంది. దాన్ని తప్పించుకుని ఒమిక్రాన్ వేరియంట్‌ శరీరంలో ఎదుగుతుంది. అందుకే వ్యాక్సిన్‌లను చాలా క్రిటికల్‌గా విశ్లేషించి సరికొత్త పరిష్కార మార్గాన్ని గుర్తించాలంటున్నారు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా.


 


దీనిపై వ్యాక్సిన్ తయారీ దారులు ఏమంటున్నారంటే...
రష్యన్ గమాలియా ఇనిస్టిట్యూట్: 
స్పుత్నిగ్ వీ కొవిడ్ వ్యాక్సిన్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పని చేస్తుందని ప్రకటించింది. ఇప్పటికే దీనిపై పరిశోధనలు ప్రారంభించామని... త్వరలోనే పూర్తి స్థాయిలో మెడిసిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటనలో తెలిపింది. గమాలియా ఇనిస్టిట్యూట్ తయారు చేసిన  స్పుత్నిక్‌ వి, స్పుత్నిక్ లైట్‌ ఒమిక్రాన్ పట్ల న్యూట్రలైజ్‌గా పని చేస్తుందని.. దీంతోపాటు ఇతర మ్యూటేషన్లపై  ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని ఆర్డీఐఎప్‌ హెడ్‌ కిరిల్‌ డిమమిత్రివ్‌ తెలిపారు. ఒక వేళ వ్యాక్సిన్‌ను అప్‌డేట్ చేయాల్సి వస్తే మాత్రం 45రోజుల్లో వ్యాక్సిన్ రెడీ చేసే సామర్థ్యం తమ వద్ద ఉందని కిరిల్ డిమిత్రివ్‌ పేర్కొన్నారు. 


మోడెర్న:
ఒమిక్రాన్ వేరియంట్‌ ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యాక్సిన్ తయారు చేయడానికి, రవాణాకు నెలల సమయం పడుతుందని యూఎస్‌ బేస్డ్‌ మోడర్నా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తయారీ 2022 ప్రారంభంలో మాత్రమే అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వచ్చే రెండు, మూడు వారాలే రక్షణ ఉంటుందన్నారు. ఒక వేళ సరికొత్త వ్యాక్సిన్ తయారు చేయాలంటే మాత్రం 2022 వరకు ఆగాల్సిందేనంటున్నారు. 


ఫైజర్‌-బయోటెక్‌: యూఎస్‌ సంస్థ కొత్త వేరియంట్లు ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకొని పని స్టార్ట్ చేసిందని ఏఎప్‌పీ నివేదించింది. ఫైజర్ ప్రస్తుతం తన వ్యాక్సిన్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌కు వ్యతిరేకంగా పరీక్షిస్తోంది. 


Read Also: రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు చాలా? ఎక్కువ తాగితే ప్రమాదమా?


Read Also: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?


Read Also: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...


Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి