జీవాన్ని నిలబెట్టడానికి నీరు చాలా అవసరం. పూర్వం నదులు, సరస్సులకు దగ్గర్లోనే మానవ నివాసాలు ఉండేవి. ఇప్పుడు పైపుల ద్వారా మనం నివాసం ఉన్నచోటికే నీటిని రప్పించుకుంటున్నాం. చక్కటి ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం అవసరం. నీరు అతిగా తాగినా, తక్కువగా తాగినా కూడా శరీర క్రియలకే భంగం కలుగుతుంది. 


నీరు ఎందుకు అవసరం?
మన శరీరంలో 50 శాతం నుంచి 70 శాతం వరకు ఉండే ప్రధాన రసాయన భాగం నీరే. శరీరంలోని ప్రతి కణం, కణజాలం, అవయవం సరిగ్గా పనిచేయడానికి నీరు అవసరం. ఇది మూత్ర విసర్జన,  చెమట, ప్రేగలు కదలికల ద్వారా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. శరీర ఉఫ్ణోగ్రతలను క్రమబద్దీకరిస్తుంది. మెదడు దాని విధులను చేయడంలో సహాయపడుతుంది. నీటితో కూడిన పానీయలు, ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి నిల్వను పెంచుకోవాలి. 


రోజుకు ఎంత నీరు అవసరం?
ఒక వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి అన్నది అతని జీవనశైలి, వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎలాంటి వాతావరణంలో నివసిస్తున్నారు అన్న దానిపై కూడా ఈ విషయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చల్లని ప్రదేశాల్లో జీవించేవారు తక్కువ నీళ్లు తాగినా చాలు, కానీ వేడి ప్రదేశాల్లో ఉన్నవారు మాత్రం నీళ్లు, ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. అమెరికాకు చెందని ప్రతిష్ఠాత్మక మాయో క్లినిక్ సగటు ఆరోగ్యవంతమైన మనిషి తాగాల్సిన నీళ్లను సిఫారసు చేసింది. 
పురుషులు రోజుకు దాదాపు 15.5 కప్పులు (3.7 లీటర్లు)
స్త్రీలు రోజుకు దాదాపు 11.5 కప్పులు (2.7 లీటర్లు)


ఈ సిఫారసు నీరు, ఇతర పానీయాలు, ఆహారం నుంచి మనం తీసుకునే ద్రవాలు కలుపుకునే. రోజువారీ ఆహారం ద్వారా మనకు 20 శాతం నీరు ఒంట్లో చేరిపోతుంది. మిగిలినది నీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు వంటి వాటి ద్వారా భర్తీ చేయాలి. 


రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు ఎందుకు?
ఇది ఎంత నీరు తాగారో తెలుసుకునేందుకు సులువైన లెక్క. కప్పులు, లీటర్ల లెక్కకన్నా గ్లాసుల లెక్క సులువుగా మీరు అర్థమవుతుంది. అందుకే ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగమని చెబుతారు. అయితే వ్యాయామం చేసినవాళ్లకి, ఎండలో కష్టపడేవారికి చెమట  ద్వారా చాలా ద్రవాలు బయటికిపోతాయి. వాళ్లు మరో గ్లాసు అధికంగా తాగాల్సి ఉంటుంది. 


నీరు అతిగా తాగితే ఏమవుతంది?
నీరు అవసరానికి మించి అతిగా తాగితే మీ మూత్రపిండాలు చాలా అధికంగా పనిచేయాల్సి వస్తుంది. అదనంగా చేరిన నీటిని బయటకు పంపించేందుకు అవి నిరంతరం కష్టపడతాయి. అంతేకాదు మీ రక్తంలోని సోడియం కంటెంట్ పలుచగా మారుతుంది. దీనిని హైపోనాట్రేమియా అంటారు. దీని వల్ల ఒక్కోసారి పరిస్థితి చేయిదాటి పోవచ్చు. కొన్ని సార్లు మూత్రపిండాలు వైఫల్యం, గుండెకు రక్త ప్రసరణ సరిగా కాకపోవడం వంటివి ఏర్పడతాయి.  


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?


Read Also: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...


Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి