ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,730 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 101 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,439కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 138 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,184 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,102 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






Also Read: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 42 మంది విద్యార్థులకు పాజిటివ్...


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,725కి చేరింది. గడిచిన 24 గంటల్లో 138 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,102 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,439కు చేరింది. 


Also Read: విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !


ఒమిక్రాన్ పై భయాందోళనలు


కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్‌పై ఇప్పటికే భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాలు ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఠానెలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు కల్యాణ్ దోంబివాలీ ముస్పిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.  అయితే అతనికి సోకింది ఒమ్రికాన్ వేరియంట్ సోకిందా లేదా సాధరణమైనా కొవిడ్ అన్న విషయంపై స్పష్టత లేదు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి నవంబర్ 24న బాధితుడు దోంబివాలీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.





" దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అతను ఎవరినీ కలవలేదు. ప్రస్తుతం అతను ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటర్‌లో ఉన్నాడు. కేడీఎమ్‌సీ ఆరోగ్య సిబ్బంది హైఅలర్ట్‌లో ఉన్నారు. కొత్త వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటాం."-డా. ప్రతిభా పాటిల్, ఆరోగ్య అధికారి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి