పొట్టి పొట్టి డ్రెస్సులు, అర్థనగ్న ప్రదర్శనలతో చాలా పాపులర్ అయింది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. మొన్నటికి మొన్న హిందీ బిగ్‌బాస్ లో మెరిసింది ఈ భామ. ఈమె తన డ్రెస్సింగ్ వల్ల చాలా ట్రోలింగ్ బారిన కూడా పడింది. నెటిజన్లు చాలా సార్లు ‘సిగ్గుందా’ అంటూ ఆమెపై కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఆమెను ‘పోర్న్ స్టార్’ అంటూ ఎగతాళి చేసిన వారూ ఉన్నారు. కానీ ఉర్ఫీ మాత్రం తాను చాలా డిఫరెంట్ అని చెబుతోంది. వేసుకునే వస్త్రాలను బట్టి నేను ఎలాంటిదాన్నో ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నిస్తోంది. ఆమె తాజాగా చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
‘అందరూ నటుల్లాగే నేను కూడా మంచి ప్రాజెక్టుల్లోనే నటించాలనుకుంటున్నా. బోల్డ్ సీన్లతో సెక్స్‌ను ప్రమోట్ చేసే ఎన్నో వెబ్ సిరీస్ లలో నాకు అవకాశాలు వచ్చాయి. అన్నింటికీ కాదని చెప్పా. నా డ్రెస్సింగ్ చూసి నాకు అలాంటి అవకాశాలు వస్తున్నాయి. సెక్స్ ని అమ్ముకుని బతికే వెబ్ సిరీస్‌లలో నేను నటించను. బోల్డ్ గా డ్రెస్ చేసుకుంటే, బోల్డ్ సీన్లలో కూడా నటిస్తానని అర్థం కాదు. నేను అలాంటి సీన్లలో నటించడానికి సిద్ధంగా లేను’ అని చెప్పింది ఉర్ఫీ.
బోల్డ్ వెబ్ సిరీస్‌ల గురించి గతంలో సల్మాన్ ఖాన్ కూడా విమర్శించారు. సినిమాలు కుటుంబమంతా కూర్చుని కలిసి చూసేలా ఉండాలని అన్నారు. సల్మాన్ చేసే సినిమాల్లో అందుకే అభ్యంతరకర సన్నివేశాలు ఉండవు. కానీ ఇప్పుడు వస్తున్న చాలా వెబ్ సిరీస్‌లు పిల్లలతో కలిసి చూడలేని విధంగా ఉన్నాయి.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: అక్కడ ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్‌తో తల్లి... ఇక్కడ ఇండియాలో కేసుల్లో చిక్కుకున్న హీరోయిన్!
Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి