Guppedantha Manasu (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
గుప్పెడంతమనసు అక్టోబరు 5 ఎపిసోడ్
ఈ రోజు ఎపిసోడ్ కూడా జగతి అంత్యక్రియలు, ఏడుపులతోనే ప్రారంభమైంది...
లే అమ్మా అని రిషి
జగతీ అని మహేంద్ర
మేడం లేవండి మేడం అని వసుధార...
పిన్నీ చక్కగా మా మాట వినిఉంటే కొడుకుతో కలసి ప్రశాంతంగా బతికేదానివి..ఇప్పుడు శవమైపోయావ్ కాలేజీ నాది..నువ్వు బతికి ఉండగానే చూడాల్సింది..కానీ నిన్ను చంపి సాధించాను..నీకు అక్కడ కూడా పీస్ ఉండకూడదని శైలేంద్ర మాట్లాడతాడు..
ఆ తర్వాత అందరూ ఇంటికెళ్లిపోతారు..
ఇంటికి వెళ్లిన తర్వాత జగతి ఫొటోకి దండ వేసేశారు... రిషి-వసు-మహేంద్ర ఎవరికి వాళ్లే బాధపడతారు...
మహేంద్ర నిద్రపోయారని గమనించి..వసుధార..సార్ మహేంద్ర సార్ నిద్రపోయారు మీరు లేవండి అంటుంది.. ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది..ఇంతలో రిషి వసు చేయి పట్టుకుంటాడు..
రిషి: నువ్వు ఇక్కడే ఉండు..నీతో చాలా మాట్లాడాలని ఉంది..మా అమ్మను నాకు దూరం చేసింది ఎవరు..వాళ్లని వదిలిపెట్టను..ఈ విషయంలో నాకు సహకరించాలి
వసు: జరిగిన నష్టం జరిగిపోయింది..అది ఎందుకు జరిగిందో తప్పకుండా తెలుసుకుంటాను..మీరు ఆవేశంగా కాక ఆలోచన సరిగ్గా సాగితేనే వాళ్లెవరో కనిపెట్టగలం..ముందు ఈ బాధ తగ్గనివ్వండి..నిద్రపోండి సార్.. నిద్రపట్టదని తెలుసు కానీ ప్రయత్నించండి..జరిగింది వెనక్కు రాదు
థ్యాంక్స్ వసుధారా నువ్వు జాగ్రత్త....
Also Read: అమ్మా లే అమ్మా లే అంటూ కదిలించేసిన రిషి, జగతిది హత్యే అని బయటపడుతుందా!
దేవయాని-శైలేంద్ర
ఏంటి మమ్మీ పిన్ని ఫొటో దగ్గర దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్..కొంపతీసి పిన్ని చనిపోయిందని బాధపడుతున్నావేంటి అంటూ ఎంట్రీ ఇస్తాడు శైలేంద్ర. అది మానవత్వం ఉన్నవాళ్లకి ఉంటుంది నాకు కాదు... రిషిని చంపాలని చూసి జగతిని చంపాల్సి వచ్చింది ఈ విషయం రిషికి తెలిస్తే ఏం జరుగుతుందో అనే భయం ఉంది..ఓ వైపు బాధపడుతూనే మరోవైపు ఎంక్వైరీ చేస్తున్నాడంటుంది. వాడికి తెలిసే అవకాశం ఉండదు.. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పటికే వాడు ఉండడు వాడిని కూడా లేపేస్తాంటాడు శైలేంద్ర. అందర్నీ చంపేస్తానంటున్నావ్ ఈ మధ్యలో మన టికెట్ చిరిగిపోతుందేమో అంటుంది దేవయాని.... ఇంతలో జగతి ఫొటో దగ్గర దీపాలు ఆరిపోవడంతో..చచ్చి కూడా మనల్ని సాధిస్తుందా ఏంటని భయపడుతుంది దేవయాని... గాలివచ్చి దీపాలు ఆరిపోయాయని చెబుతాడు శైలేంద్ర. నాకైతే ఏదో భయంగా ఉందంటుంది దేవయాని..
Also Read: జగతిని చంపేశారు, మళ్లీ బాధ్యతలు తీసుకున్న రిషి - ఇక తల్లీ కొడుకుల ఆటకట్టు!
మహేంద్ర భోజనం చేయకుండా కూర్చుంటాడు..రిషి బతిమలాడుతాడు..అమ్మ మీ బాధ్యత నాకు అప్పగించింది డాడ్ అని నచ్చచెబుతాడు. నాక్కూడా అమ్మకావాలనే ఉంది కానీ అమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని బాధపడతాడు.
మహేంద్ర: జగతి 20 ఏళ్లు దూరమైనా తట్టుకున్నాను కానీ ఇప్పుడు శాశ్వతంగా దూరమైపోయింది..జగతి నన్ను వదివేసి వెళ్లిపోయిన రేజే నా ఆకలి చచ్చిపోయింది..ఇప్పుడు జగతి మహేంద్ర పక్కన లేదు..నా జీవితం జగతి దగ్గరే ఆగిపోయింది...
వసు: మీరు తినకపోతే రిషి సార్ కూడా ఏమీ తినరు..మీరిలా ఉంటే మేడం బాధపడతారు..ప్లీజ్ సార్...
నాకోసం తినండి డాడ్ అని రిషి తినిపిస్తాడు...
చక్రపాణి ఇదంతా చూసి బాధపడతాడు... దేవుడా ఏంటీ పరిస్థితి అనుకుంటాడు.. చీమకైనా హాని తలపెట్టనివాళ్లకి ఎందుకీశిక్ష...
( ఆశాపాసం బంధీ చేసేనే సాంగ్ బ్యాగ్రౌండ్ లో వస్తుంటుంది.. రిషి, వసు, మహేంద్ర ఎవరికి వారే జగతితో జ్ఞాపకాలు తలుచుకుంటారు)
Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!
Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్లో ధాత్రి
Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్
Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?
Shobha Shetty: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
/body>