పవర్ స్టార్ ఈజ్ బ్యాక్, గన్‌తో అదరగొట్టిన పవన్ - యాక్షన్‌లోకి దిగిన ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie) కూడా ఒకటి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రాజకీయాలతో బిజీగా ఉండడంతో తాను కమిటీ అయిన సినిమాలకు సమయం దొరికినప్పుడల్లా కాల్ షీట్స్ కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు పవన్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న 'OG' సినిమాకు సంబంధించి టీజర్, ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


జవాన్ రివ్యూ: షారుక్ ఖాన్ మాస్ యాక్షన్ అవతార్ ఎలా ఉంది? ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర గెలుస్తాడా?
ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పఠాన్’తో హిందీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్ షారుక్. వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ‘జవాన్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘పఠాన్’ కంటే ఎక్కువ అంచనాలతో జవాన్ విడుదల అవుతోంది. అపజయం ఎరుగని అట్లీ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం ఇవన్నీ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచాయి. ‘పఠాన్’ కంటే ఎక్కువ వసూళ్లను ‘జవాన్’ సాధిస్తుందని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రివ్యూ : అనుష్క, నవీన్ పోలిశెట్టిల సినిమా హిట్టా? ఫట్టా?
అనుష్క శెట్టి సినిమా ఐదేళ్ల తర్వాత వెండితెరపైకి వచ్చింది. థియేటర్లలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఈ రోజు విడుదలైంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రమిది. యువి క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అనుష్క తల్లి బాలకృష్ణకు వీరాభిమాని- ఈ ఇంట్రెస్టింగ్ విషయం మీకు తెలుసా?
‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క తల్లిగా జయసుధ నటించారు. ఎప్పటిలాగే ఆమె చక్కటి నటనతో ఆకట్టుకుంది. తల్లిగా ఒదిగిపోయిన నటించింది సహజ నటి. ఈ చిత్రంలో ఆమెను బాలకృష్ణ వీరాభిమానిగా  చూపించారు దర్శకుడు మహేష్ బాబు. బాలయ్య అంటే పడిచచ్చే అభిమానిగా ఆమె కనిపించారు. ఈ చిత్రంలో జయసుధ పాత్ర నటసింహం అభిమానులకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిందట. ఇక ఇప్పటికే బాలయ్యతో కలిసి జయసుధ పలు చిత్రాల్లో నటించింది. పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన ‘అధినాయకుడు’లో జయసుధ నటించి మెప్పించింది. ఇందులో బాలయ్య 3 పాత్రలు చేయగా, అన్ని పాత్రలకు జంటగా జయసుధ నటించింది. ఒక బాలయ్యకు భార్యగా, మరో బాలయ్యకు తల్లిగా,  ఇంకో బాలయ్యకు నాయనమ్మగా నటించింది. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా, ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు.  బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తో పలు హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె బాలయ్యతో జతకట్టడం థ్రిల్‌ కల్గించిందని అప్పట్లో జయసుధ చెప్పింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాలు బాలయ్యతో కలిసి ఆమె స్ర్కీన్ షేర్ చేసుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీలో ఆర్జీవీ- షూటింగ్ కంప్లీట్ అయినట్లేనా?
ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా‘కల్కి 2898 ఏడీ’.  ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్, గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)