పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie) కూడా ఒకటి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రాజకీయాలతో బిజీగా ఉండడంతో తాను కమిటీ అయిన సినిమాలకు సమయం దొరికినప్పుడల్లా కాల్ షీట్స్ కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు పవన్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న 'OG' సినిమాకు సంబంధించి టీజర్, ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.


గత వారం రోజులుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా 'OG' మత్తులోనే ఉన్నారు. టీజర్ లో దర్శకుడు సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో పాటు గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ ని స్టైల్, యాక్షన్, స్వాగ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దానికి తోడు తమన్ బీజీయం టీజర్ ని నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం 'OG' వైబ్ లో ఉండగా దాన్ని మరింత రెట్టింపు చేస్తూ దర్శకుడు హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్ ' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ మళ్లీ 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ లో అడుగుపెట్టారు. నిజానికి ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రెండు రోజుల ముందే మొదలవ్వాల్సి ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా షూటింగ్ ఆగిపోయింది.


అయితే తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ 'మాసివ్ షెడ్యూల్ లో పవర్ ప్యాక్డ్ సీన్స్ ని షూట్ చేస్తున్నట్లు' తెలిపారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని చైర్ లో కూర్చుని మాస్ లుక్ లో అదరగొట్టేసారు. ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పై  భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు హరీష్ శంకర్ రెండు రోజుల క్రితం 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ సెప్టెంబర్ 5 నుంచి పునః ప్రారంభం కాబోతుందని అప్డేట్ ఇస్తూ ఓ పిక్ ని షేర్ చేశారు. అందులో హరీష్ శంకర్ నిలబడి ఉండగా, ఆయన ఎదురుగా రకరకాల కత్తులు ఉన్నాయి.






దీంతో లేటెస్ట్ షెడ్యూల్లో హరిశ్ శంకర్ ఓ మాసివ్ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే హరీష్ శంకర్ ఈ మూవీని ప్లాన్ చేసినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Also Read : మమ్ముట్టి మాస్, ఫైర్ అంతే - 'భ్రమ యుగం'లో మలయాళ మెగాస్టార్ లుక్ చూశారా?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial