మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్, మమోగ్రాఫ్ చేస్తారు. వీటి ద్వారా క్యాన్సర్ ఉందో లేదో రొమ్ముని పరిశీలిస్తారు. అయితే ఈ పరీక్షల పేర్లు వినడమే కానీ వాటి గురించి ఎవరికీ అంతగా తెలియదు. అసలు ఈ పరీక్షలు ఎందుకు చేస్తారు? అవి చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం.


అల్ట్రా సౌండ్, మమోగ్రాఫ్ పరీక్ష చేయించుకునే రోజు చర్మ ఉత్పత్తులు ఏవీ ధరించకూడదు. చర్మాన్ని సున్నితంగా మార్చే క్రీములు రాసుకోకూడదు.


హాస్పిటల్ కి వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. అప్పుడే పరీక్ష చేసే ముందు వాటిని తొలగించడం సులభం అవుతుంది.


పరీక్షకు వెళ్ళే ముందు ఏమి తినకూడదు, తాగకూడదు


పరీక్ష సమయంలో ఏమైనా జాగ్రత్తలు ఉంటే వైద్యులని తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.


రొమ్ముకి అల్ట్రా సౌండ్ ఎలా చేస్తారు?


సాంకేతిక నిపుణులు రొమ్ము చర్మంపై ఒక జెల్ ని రాస్తారు. ట్రాన్స్ డ్యూసర్ తో రొమ్ము చర్మం మీద కదిలిస్తూ కణజాలాలు సరిగ్గా అధ్యయనం చేస్తారు. ఈ పరీక్ష చేసే ముందు రోగి ధరించే నగలు, దుస్తులు తీసేయాలి.


మమోగ్రామ్ ఎలా చేస్తారు?


కంటికి కనిపించని విద్యుదయస్కాంత కిరణాలు రొమ్ముల అంతర్గత కణజాల చిత్రాలు తీయడానికి ఉపయోగిస్తారు. ఈరోజుల్లో డిజిటల్ మమోగ్రఫీని ఉపయోగిస్తున్నారు. జాన్ హాప్ కిన్స్ వెబ్ సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం డిజిటల్ మమోగ్రఫీ కూడా సాధారణ మమోగ్రాఫ్ మాదిరిగానే చేస్తారు. ఇది కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా రొమ్ముల చిత్రాలని తీస్తుంది. మమోగ్రాఫ్ కి రిమోట్ యాక్సెస్ అవసరం. ఈ చిత్రాలని రేడియాలజిస్ట్ పరిశీలిస్తారు.


మమోగ్రఫీ అంటే ఏంటి?


మమోగ్రఫీ రొమ్ము ఎక్స్ రే. రొమ్ములో గడ్డలు, చర్మం ఎలా ఉంది, ఇండెంటేషన్, చనుమొల ఏ విధంగా ఉంది వంటివి చెక్ చేస్తారు. రొమ్ము క్యాన్సర్, కణితిలు, తిత్తులు గుర్తిస్తారు. స్క్రీనింగ్ మమోగ్రామ్, డయాగ్నస్టిక్ మమోగ్రామ్ వంటి వివిధ రకాల మమోగ్రామ్ లు ఉంటాయి.


అల్ట్రా సౌండ్ అంటే ఏంటి?


ఇదొక ఇమేజింగ్ పరీక్ష. రొమ్ముల లోపలి భాగంలో ఏవైనా అసాధారణతలు ఉన్నాయో లేదో ధ్వని తరంగాల ద్వారా చెక్ చేస్తారు. మామోగ్రామ్ లో మార్పు కనిపించినప్పుడు ఈ పరీక్ష చేస్తారు. ఒక్కోసారి మమోగ్రామ్ లో చూడలేని అసాధారణతలు కూడా ఇందులో తెలిసిపోతాయి. ఇవి రెండూ కూడా రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి చూస్తారు. వీటి పేర్లు తెలిసినా వాటిని ఎందుకు చేస్తారో తెలియదు.


ఈ పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?


ఈ పరీక్షలు ఎందుకు చేయించుకోవాలో కాదు ఎవరు చేయించుకోవాలో కూడా తెలుసుకోవడం ముఖ్యం. 40 సంవత్సరాలు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారైన రొమ్ము స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే అటువంటి వాళ్ళు 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఏటా పరీక్షలు చేయించుకుంటే జాగ్రత్త పడొచ్చు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేశారంటే అందంగా మెరిసిపోతారు