అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజినీకాంత్ - రాజమండ్రి పర్యటన రద్దు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రజినీకాంత్ ఆదివారం కలిసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే, అనివార్య కారణాల వల్ల రజినీకాంత్ ఆదివారం చంద్రబాబును కలవడానికి వెళ్లలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కలవాల్సి ఉండేది. కానీ, ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లలేకపోయాను’’ అని తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రాజమౌళి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కాపీ మాస్టర్ - బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన దర్శక ధీరుడాయన. భాషా ప్రాంతీయత అడ్డంకులు తొలగించి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే తాటి మీదకు తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడమే కాదు, ఇండియన్ సినిమాకు ఆస్కార్ కలను సాకారం చేసిపెట్టాడు.  అలాంటి అగ్ర దర్శకుడిపై బాలీవుడ్ కు చెందిన కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. రాజమౌళి ఒక పర్ఫెక్ట్ కాపీ మాస్టర్ అని ట్వీట్ చేసాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కమల్ హాసన్ కల్ట్ క్లాసిక్ మూవీ రీ-రిలీజ్‌కు రెడీ - మాటలుండవ్!
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో.. గతంలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రాలను మరోమారు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఐకానిక్ మూవీ రీరిలీజ్ కు అధికారిక ప్రకటన వచ్చింది. విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'పుష్పక విమానం' సినిమాని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ శనివారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కంఫర్మ్ చేసిన డైరెక్టర్!
కింగ్ ఖాన్ షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో షారూఖ్ ద్విపాత్రాభినయం చేయగా.. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు అట్లీ 'జవాన్ 2' గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


హీరోగా యూట్యూబర్ హర్ష సాయి - ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ టీజర్!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకు హర్ష సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్నవారికి, పెద్దవాళ్ళకి తనవంతు సాయం చేసే ఈ యూట్యూబ్ స్టార్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో సహా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కలిపి అతనికి 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతటి పాపులారిటీ ఉన్న హర్ష సాయి.. ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)