గీతా ఆర్ట్స్ లో అక్కినేని హీరో నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
గతేడాది ‘బంగార్రాజు’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. 'థాంక్యూ' చిత్రంతో డిజాస్టర్ చవిచూశాడు. అలానే తొలిసారి హిందీలో నటించిన 'లాల్ సింగ్ చెద్దా' సినిమా కూడా నిరాశ పరిచింది. ఎలాగైనా హిట్టు కొట్టాలని 'కస్టడీ' సినిమాతో వచ్చిన చైతూని, ఈసారి కూడా పరాజయమే పలకరించింది. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ బైలింగ్వల్ యాక్షన్ థ్రిల్లర్ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ ఏంటి? ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు? అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చై నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
యాక్సిడెంట్ అయినప్పుడు కారులోనే శర్వానంద్ - గాయాలు ఏం కాలేదు!
యువ కథానాయకుడు శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర అదుపు తప్పింది. ఇది స్వల్ప ఘటన అని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని హీరో ప్రతినిథులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వారు అందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) కథానాయకుడిగా రామ్ చరణ్ (Ram Charan) నిర్మాణ భాగస్వామిగా ఓ సినిమా రూపొందుతోందని ఏబీపీ దేశం శనివారమే పాఠకులకు తెలియజేసింది. ఈ రోజు అధికారికంగా ఆ చిత్రానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
యుగపురుషుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించిన వేడుకలకు ఆయన మనవళ్లు, హరికృష్ణ కుమారులైన నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హాజరు కాలేదు. ఇటు నందమూరి అభిమానులు, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'దేవర' (Devara Pan India Movie). 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఏకధాటిగా చిత్రీకరణ చేశారు. మే 20న తన పుట్టినరోజు సందర్భంగా సినిమా చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చారు ఎన్టీఆర్! ఇంకో వారం 'దేవర'కు విశ్రాంతి అని తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)