మండే ఎండలు, వేడి గాలుల వల్ల శరీరం త్వరగా అలిసిపోతుంది. వేసవి తాపానికి ఆహారాన్ని అదుపులో ఉంచుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. హీట్ వేవ్ అనేక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది మరింత అలసటకి దారి తీస్తుంది. వడదెబ్బ వల్ల జ్వరం, నీరసం అనిపిస్తుంది. భానుడు ప్రతాపానికి 11 దాటితే బయటకి రావొద్దని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువగా నీళ్ళు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు తాగాలని సూచిస్తున్నారు.


హీట్ స్ట్రోక్ అంటే ఏంటి?


శరీరం వేడెక్కడం వల్ల తరచుగా సంభవించే ఒక సాధారణ పరిస్థితి హీట్ స్ట్రోక్. వేడి, సూర్యుడు, శారీరక శ్రమకి ఎక్కువ సేపు బహిర్గతం కావడం వల్ల వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి బారిన పడతారు. హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్, వడదెబ్బ అనేక పేర్లు ఉన్నాయి. వెంటనే చికిత్స చేయకపోతే మెదడు తీవ్రంగా దెబ్బతింటుంది. అంతర్గత అవయవాల పనీతిరుని కూడా దెబ్బతీస్తుంది. దాని నుంచి బయట పడాలంటే శరీరం చల్లదనం అందించాలి. హీట్ వేవ్ తో పోరాడేందుకు ఈ ఆహారాలు తీసుకుంటే మంచిది.


దోసకాయ


వేసవిలో ముఖ్యమైన, ప్రధానమైన దోసకాయ తీసుకుంటే వేడి తరంగాలతో పోరాడేందుకు సహాయపడే ఉత్తమమైన ఆహారాలలో ఒకటిగా నిలుస్తుంది. అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్లు ఏ, బి, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మిమ్మల్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచుతుంది.


టొమాటో


వేడిని తట్టుకునే శక్తి టొమాటోలు చక్కగా ఉపయోగపడతాయని చాలా మందికి తెలియదు. హైడ్రేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. శరీర వాపు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.


పెరుగు


వేసవిలో కూలింగ్ ఫుడ్ పెరుగు అని అందరికీ తెలిసిందే. రైతా, మజ్జిగ, లస్సీ వంటి అనేక విధాలుగా తీసుకోవచ్చు. గట్ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచే ప్రొబయోటిక్స్ పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి చలువ చేస్తుంది. వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్యకరం.


కొబ్బరి నీళ్ళు


హీట్ వేవ్ తో పోరాడేందుకు ఉత్తమ పానీయం కొబ్బరి నీళ్ళు. ఇది ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. పోషకాలు నిండు. శీతలీకరణ విశ్రాంతిని ఇస్తుంది. శరీరంలోని సోడియం, పొటాషియం సమతుల్యతను కాపాడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.


పుదీనా


అన్ని వేళలా లభించే పుదీనా మజ్జిగ లో వేసుకుని తాగితే హాయిగా అనిపిస్తుంది. దీన్ని ఎక్కువగా చట్నీ రూపంలో వినియోగిస్తారు. సువాసన ఇవ్వడమే కాదు మంచి రుచి కలిగి ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


పుచ్చకాయ


వేసవిలో మిస్ కాకుండా తినాల్సిన ఫ్రూట్. అత్యంత హైడ్రేటింగ్ సమ్మర్ ఫ్రూట్. పోషకాలు మెండు, అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది. జీర్ణక్రియను చెక్కుచెదరకుండా కాపాడుతుంది.


ఇతర నివారణ చిట్కాలు


☀ వేసవిలో శరీరానికి సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం. అందుకే తగినంత ద్రవాలని తీసుకోవాలి.


☀ ఎండ బాగా ఎక్కువగా ఉంటే బయటకి వెళ్ళే పనులు వాయిదా వేసుకోవడం మంచిది.


☀ లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు అనువైనవి.


☀ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడే చల్లని నీటి స్నానం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: షాకింగ్ స్టడీ - మైక్రోప్లాస్టిక్ వల్ల పిల్లలు పుట్టడం కష్టమేనట!